HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Earthquake In Andhra Pradeshs Prakasam District Mundlamuru Mandal Surrounding Areas

Earthquake : ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో మరోసారి భూకంపం

ఏపీలోని ప్రకాశం జిల్లాలో మరోసారి స్వల్ప భూకంపం(Earthquake) వచ్చింది.  

  • Author : Pasha Date : 02-01-2025 - 3:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Earthquake Mundlamuru Prakasam District 2025 JANUARY 2

Earthquake :  ఏపీలోని ప్రకాశం జిల్లాలో మరోసారి స్వల్ప భూకంపం(Earthquake) వచ్చింది.  ముండ్లమూరు మండలం పరిసర ప్రాంతాల్లో ఇవాళ  మధ్యాహ్నం 1:43 గంటలకు భూమి కంపించింది. దాదాపు సెకను పాటు భూమి కంపించడంతో జనం భయభ్రాంతులకు లోనయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. డిసెంబరు నెల మూడోవారం, నాలుగు వారంలోనూ ఇదే విధంగా ముండ్లమూరు మండలంలో భూ ప్రకంపనలు సంభవించాయి. మొత్తం మీద గత నెలలో ఈ మండలం పరిధిలో మూడుసార్లు భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కేవలం నెల రోజుల వ్యవధిలో నాలుగుసార్లు భూమి కంపించడంతో మండల ప్రజలు ఆందోళనకు లోనవుతున్నారు.

Also Read :Indian Nurse : కేరళ నర్సుకు యెమన్‌లో మరణశిక్ష.. సాయం చేస్తానని ప్రకటించిన ఇరాన్ అధికారి

జనవరి 1న భూకంపం

న్యూ ఇయర్‌లో మొదటి రోజున (జనవరి 1న) ఉదయమే 10 గంటల 24 నిమిషాలకు గుజరాత్‌లోని కచ్‌ జిల్లాలో భూకంపం వచ్చింది. దీంతో అక్కడి ప్రజలు భయపడ్డారు. కచ్‌ జిల్లాకు ఉత్తర-ఈశాన్యం దిశగా 23 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని గుర్తించారు.  3.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని అధికార వర్గాలు తెలిపాయి. 2024 సంవత్సరం నవంబర్ 18న కచ్‌లో 4 తీవ్రతతో భూకంపం వచ్చింది.

Also Read :Formula E Race Case : ఫార్ములా ఈ రేస్ కేసు.. ఈడీ విచారణకు బీఎల్ఎన్ రెడ్డి  గైర్హాజరు

డిసెంబరు 8న నాలుగు రాష్ట్రాల్లో..

2024 సంవత్సరం డిసెంబరు 8వ తేదీన  కొన్ని గంటల వ్యవధిలోనే దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో భూకంపం వచ్చింది. భూకంప కేంద్రాలను గుజరాత్​, మేఘాలయ, తమిళనాడు, కర్ణాటకల్లో గుర్తించారు.  అంతకుముందు డిసెంబరు 6వ తేదీన తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో 3.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

డిసెంబరు 4న తెలుగు రాష్ట్రాల్లో..

డిసెంబరు 4న ఉదయం 7 గంటల 27 నిమిషాలకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో పలు చోట్ల భూకంపం వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల ప్రజలు 55 ఏళ్ల తర్వాత తొలిసారి భూకంపాన్ని ఫీలయ్యారు. తెలంగాణలోని ములుగు జిల్లా మేడారం సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించామని హైదరాబాద్‌ ఎన్‌జీఆర్‌ఐలో ఉన్న భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.3గా నమోదైంది.ఈ భూకంప తరంగాలు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ల సరిహద్దు ప్రాంతాలను కూడా తాకాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • earthquake
  • Earthquake in AP
  • Mundlamuru
  • Prakasam District

Related News

Nara Bhuvaneshwari Anna Canteens

Nara Bhuvaneswari: అన్న క్యాంటీన్‌లో పేదలతో కలిసి చంద్రబాబు,భువనేశ్వరి అల్పాహారం

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి పుట్టిన రోజు సందర్భంగా అన్నా క్యాంటీన్లకు నారా భువనేశ్వరి రూ.76 లక్షలను విరాళంగా ఇచ్చారు. ఉదయాన్నే చంద్రబాబుతో కలిసి అన్నా క్యాంటీన్‌కు వెళ్లిన ఆమె.. అక్కడికి వచ్చిన వారికి అల్పాహారం వడ్డించడంతోపాటు.. వారితో కలిసి స్వయంగా ఆహారం తీసుకున్నారు. తద్వారా పుట్టిన రోజులు, పెళ్లి రోజు వంటి ప్రత్యేక రోజుల్లో అందరూ అన్నదానానికి తమకు తోచిన మొత్తం వ

  • Simhachalam Chandanotsavam Simhadri Appanna Darshanam

    Simhachalam Chandanotsavam : నేడు సింహాద్రి అప్పన్న చందనోత్సవం

  • PM Modi wishes Andhra Pradesh CM Chandrababu Naidu

    చంద్రబాబుకు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్

  • Nara Lokesh garu met Punarvika's family after she received an injection today

    Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

  • Amaravati Farmers

    Amaravati: రైతులకు గుడ్ న్యూస్.. రూ. 1.50 లక్షల రుణ మాఫీ – చంద్రబాబు

Latest News

  • Allu Arjun : ముంబైకి మకాం మార్చబోతున్న అల్లు అర్జున్ ?

  • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

  • సీఎస్కేకు గుడ్ న్యూస్‌.. స్టార్ ప్లేయ‌ర్ ఎంట్రీ!

  • TGSRTC : రేపటి నుంచి RTC బంద్..ప్రయాణికులకు కష్టాలు తప్పవా ?

  • IPL 2026 : SRH హ్యాట్రిక్ కొట్టబోతుందా..? ఉప్పల్ స్టేడియం లో నేడు పరుగుల వారదేనా ?

Trending News

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd