Dwarampudi : పవన్ చెప్పినట్లే ఈరోజు ద్వారంపూడిని రోడ్డు మీదకు ఈడ్చారు
మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి చెందిన అక్రమ కట్టడాలను కూల్చే పని పెట్టుకుంది
- Author : Sudheer
Date : 03-07-2024 - 12:03 IST
Published By : Hashtagu Telugu Desk
కూటమి సర్కార్..వైసీపీ (YCP) నేతలెవర్నీ వదిలిపెట్టడం లేదు..ఐదేళ్లు టీడీపీ , జనసేన నేతలకు , శ్రేణులకు ఎంత నరకం చూపించారో..అంత రెట్టింపు చూపించడం మొదలుపెట్టారు. గల్లీ నేతలనే కాదు మాజీ మంత్రులను, ఎమ్మెల్యేలను సైతం వదిలిపెట్టడం లేదు. వారు దోచుకున్న సొమ్ము , అక్రమంగా కట్టుకున్న కట్టడాలను ఇలా అన్నింటికీ బయటకు తీస్తూ గజగలాడిస్తున్నారు. ఇప్పటికే మాజీ సీఎం తాడేపల్లి ఇనుప కంచెలు బద్దలు కొట్టిన కూటమి సర్కార్..మిగతా నేతల అక్రమ కట్టడాలను ఎక్కడిక్కడే కూల్చేస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి (Dwarampudi Chandrasekhar Reddy)కి చెందిన అక్రమ కట్టడాలను కూల్చే పని పెట్టుకుంది. కాకినాడ లో అనుమతులు లేకుండా కట్టిన నిర్మాణాన్ని మున్సీపాల్ సిబ్బంది కూల్చేశారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన ద్వారంపూడిని పోలీసులు నడి రోడ్ మీదకు ఈడ్చికెళ్లారు. ఈ సీన్ చూసిన వారంతా పవన్ హెచ్చరికను గుర్తు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో కాకినాడ లో పవన్ కళ్యాణ్ ద్వారంపూడి కి హెచ్చరిక జారీ చేసారు. నేను కానీ అధికారంలోకి వస్తే..నడి రోడ్ మీదకు నిన్ను నిల్చుపెడతా..నీ అక్రమ కట్టడాలను కూల్చివేస్తా అని అన్నారు. ఈరోజు అదే చేసాడు..ప్రస్తుతం ఈ వీడియోస్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.
లైసెన్స్ లేవని ద్వారంపూడి బినామీ బిల్డింగ్ కూల్చివేత https://t.co/DDWDvg3Vqo pic.twitter.com/pSXjbhKKgr
— Venkat Mogali (@venkatmogali) July 3, 2024
లైసెన్స్ లేవని ద్వారంపూడి బినామీ బిల్డింగ్ కూల్చివేత https://t.co/DDWDvg3Vqo pic.twitter.com/pSXjbhKKgr
— Venkat Mogali (@venkatmogali) July 3, 2024
Read Also : MLC Kavitha : జులై 25 వరకు కవిత, సిసోడియా కస్టడీ పొడిగింపు