Duvvada Srinivas : మెట్టు దిగిన వాణి
తనకు రాజకీయాలు,, ఆస్తులు అక్కర్లేదన్న వాణి.. తన భర్త తనకు కావాలంది. దువ్వాడ శ్రీనివాస్, తామూ కలిసి అందరం ఒకే ఇంట్లో ఉండటం ముఖ్యమని, కలిసి ఉండేందుకు గానూ దువ్వాడ శ్రీను ఎలాంటి షరతులు పెట్టినా అంగీకరిస్తామని తెలిపింది
- Author : Sudheer
Date : 17-08-2024 - 8:41 IST
Published By : Hashtagu Telugu Desk
మొత్తం మీద దువ్వాడ వాణి మెట్టు దిగింది. గత పది రోజులుగా భర్త శ్రీనివాస్ ఇంటి వద్ద నిరసన తెలుపుతున్న ఆమె..ఇక శ్రీనివాస్ తో కలిసి ఉంటానని ప్రకటించింది. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ (YCP MLC Duvvada Srinivas) కుటుంబంలో నడుస్తున్న గొడవ గురించి..రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మాట్లాడుకుంటున్న సంగతి తెలిసిందే. గత కొద్దీ నెలలుగా దువ్వాడ శ్రీనివాస్ అతడి భార్య కు మధ్య విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. శ్రీనివాస్ వయసు 60 ఏళ్లు..ఈ వయసులో కుటుంబం తో కలిసి ఉండకుండా మాధురి తో అక్రమ సంబంధం పెట్టుకొని కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని భార్య, కూతుళ్లు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో పది రోజులగా టెక్కలి జాతీయ రహదారిపై నూతనంగా శ్రీనివాస్ నిర్మించుకున్న ఇంటి వద్ద ఆందోళనలు చేస్తూ వస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలో నేడు కీలక ప్రకటన చేసింది. తనకు రాజకీయాలు,, ఆస్తులు అక్కర్లేదన్న వాణి.. తన భర్త తనకు కావాలంది. దువ్వాడ శ్రీనివాస్, తామూ కలిసి అందరం ఒకే ఇంట్లో ఉండటం ముఖ్యమని, కలిసి ఉండేందుకు గానూ దువ్వాడ శ్రీను ఎలాంటి షరతులు పెట్టినా అంగీకరిస్తామని తెలిపింది. తన భర్త దువ్వాడ శ్రీనివాస్ ఎలా తిరిగినా తనకు సంబంధం లేదన్న దువ్వాడ వాణి.. కండీషన్లు పెట్టినా అంగీకరిస్తానని, కుమార్తె పెళ్లి కోసం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. కూతురి పెళ్లి కోసం, సమాజం కోసం ఒకే ఇంట్లో కలిసి ఉందామని దువ్వాడ శ్రీనివాస్‌ను కోరారు. పిల్లల భవిష్యత్తే తనకు ముఖ్యమన్న వాణి.. దువ్వాడ శ్రీనివాస్ ఎలా తిరిగినా తనకు అవసరం లేదంది. మరి వాణి కోరిక మేరకు శ్రీనివాస్ ఇంట్లోకి రాణిస్తారా..? కలిసి ఉంటారా..? అనేది చూడాలి.
Read Also : Kolkata Trainee Doctor : కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనలో కొత్త ట్విస్ట్