Pawan : పవన్ కు చంద్రబాబు నెలకు రూ.50 కోట్లు ఇస్తున్నారు – దువ్వాడ ఆరోపణలు
Pawan : పవన్ కళ్యాణ్‌కు నెలకు రూ.50 కోట్లు లంచంగా ఇస్తున్నారని దువ్వాడ ఆరోపించారు
- By Sudheer Published Date - 06:22 PM, Mon - 24 February 25

వైఎస్ఆర్పీ నేత దువ్వాడ శ్రీనివాస్ (YSRCP MLC Duvvada Srinivas), జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan)పై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌కు నెలకు రూ.50 కోట్లు లంచంగా ఇస్తున్నారని దువ్వాడ ఆరోపించారు. ఈ లంచం తీసుకోవడంతోనే పవన్ కళ్యాణ్ ప్రశ్నించకుండా మూగబోయారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని దువ్వాడ ప్రశ్నించారు. గతంలో ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ నిత్యం తన గళం వినిపించేవారని, కానీ ఇప్పుడు ఆయన పూర్తిగా చంద్రబాబు వశమైనట్లు కనిపిస్తోందని విమర్శించారు.
KCR : ఫామ్ హౌస్లో కూర్చుని కేసీఆర్ కుట్రలు చేస్తున్నాడు – సీఎం రేవంత్
పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదో మీరే అడగాలి అని జనసేన శ్రేణులకు , ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై పోరాడతామని చెప్పిన పవన్, అధికారంలోకి వచ్చాక ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన విమర్శించారు. మేం ఏదైనా అక్రమాలు చేస్తే నిర్భయంగా మాపై చర్యలు తీసుకోండి. కానీ ఎప్పుడో జరిగిన సంఘటనల కోసం ఇప్పుడు కేసులు పెట్టడం ఎంత వరకు న్యాయం?” అని దువ్వాడ ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వ హయాంలో నిర్దోషిగా ఉన్నవారిపై కుట్రలు జరిగాయని ఆయన ఆరోపించారు.
పవన్ కళ్యాణ్ స్వతంత్ర నాయకుడిగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ఆయన పూర్తిగా టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాల్సిన పవన్, చంద్రబాబుతో చేతులు కలిపి తమ రాజకీయ ప్రయోజనాలు పొందుతున్నారని విమర్శించారు. జనసేన నేతలు, కార్యకర్తలు ఈ విషయం గురించి ఆలోచించి పవన్‌ను నిజమైన ప్రజా నాయకుడిగా మారేలా ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.