HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Dussehra Holidays From October 3rd To 13th Andhra Pradesh Govt

Dussehra Holidays 2024 : ఏపీలో అక్టోబరు 3 నుంచి దసరా సెలవులు

దీని ప్రకారమే ఏపీలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ స్కూళ్లకు దసరా సెలవులు (Dussehra Holidays 2024) ఇవ్వనున్నారు.

  • Author : Pasha Date : 01-10-2024 - 12:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dussehra Holidays 2024 Ap Govt

Dussehra Holidays 2024 : దసరా సెలవులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అక్టోబరు 3 (గురువారం) నుంచి 13 (ఆదివారం) వరకు దసరా సెలవులు ఉంటాయని వెల్లడించింది. అంటే ఈసారి ఏపీ విద్యార్థులకు 10 రోజుల పాటు దసరా సెలవులు వస్తున్నాయన్న మాట.  ఈనెల 14న స్కూళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారమే ఏపీలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ స్కూళ్లకు దసరా సెలవులు (Dussehra Holidays 2024) ఇవ్వనున్నారు. అక్టోబర్ 3 నుంచి దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు కూడా మొదలవుతాయి.  అక్టోబర్ 12న విజయదశమి పండుగతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.  తొమ్మిరోజుల పాటు వివిధ రూపాలలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు. ఇక అక్టోబరు నెలలోని ఇతర సెలవుల విషయానికి వస్తే.. ఈనెల 2న గాంధీ జయంతి వేడుకలు జరుగుతాయి. అక్టోబర్ 20న ఆదివారం, అక్టోబర్ 27న  ఆదివారం ఉంది. అక్టోబర్ 31న దీపావళి పండుగ ఉంది. అక్టోబర్ నెలలో పాఠశాలలకు ఈసారి దాదాపు 16 సెలవులు  వస్తుండటం గమనార్హం. అంటే ఈనెలలో పాఠశాలలు పని చేసేది 14 రోజులు మాత్రమే. ఈలెక్కన అక్టోబరు నెల అనేది విద్యార్ధులకు పండుగ అనే చెప్పుకోవాలి. వరుస సెలవులతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల విద్యార్థులకు మంచి విశ్రాంతి లభించనుంది. ఈ సమయంలో విద్యార్థులు ఫోన్లకు హత్తుకు పోకుండా.. ఇతరత్రా ఉపయోగకర యాక్టివిటీస్ వైపు మరల్చాల్సిన బాధ్యత పేరెంట్స్‌పై ఉంది.

Also Read :Nandyala : నంద్యాలలో పట్టాలు తప్పిన రైలు.. ఏమైందంటే..

ఇక తెలంగాణ రాష్ట్రంలో దసరా సెలవులు అక్టోబర్ 2 నుంచి 14 వరకు ఉన్నాయి. దీనిపై ఇప్పటికే తెలంగాణ సర్కారు ప్రకటన చేసింది. ఈనెల 15 నుంచి తెలంగాణలో స్కూళ్లు తిరిగి మొదలవుతాయి. రాష్ట్రంలో ఎంగిలి బతుకమ్మ పండుగను అక్టోబర్ 2న నిర్వహించనున్నారు. ఆ తరువాత దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ఈ సంబురాలు ముగుస్తాయి. దసరా పండుగకు రెండు రోజుల ముందు సద్దుల బతుకమ్మ పండుగను ప్రజలు సెలబ్రేట్ చేసుకోనున్నారు.

Also Read :Govinda : గన్ మిస్‌ఫైర్.. నటుడు గోవిందా కాలులోకి బుల్లెట్‌


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh govt
  • ap govt
  • dussehra
  • Dussehra Holidays 2024
  • Vijayadashami

Related News

CM Chandrababu Naidu's sweet message to Dwakra women

Good News : డ్వాక్రా మహిళలకు సీఎం చంద్రబాబు తీపికబురు.. త్వరలో మరో పథకం అమలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ‘స్వయం’ పథకాన్ని తీసుకువస్తోంది. ఈ పథకం ద్వారా మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులకు 'గ్లోబల్ బ్రాండింగ్' కల్పించనున్నారు

  • international law university amaravati

    ప్రజా రాజధాని అమరావతిలో అంతర్జాతీయ న్యాయ వర్సిటీ

  • Ap Govt Good News

    DA Arrears : ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

  • Ap Grama Elections

    AP Grama Panchayat Election : ఏపీలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు?

Latest News

  • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

  • Rajya Sabha : తెలంగాణ నుంచి రాజ్యసభకు సింఘ్వీ, నరేందర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక!

  • త్వరలో పెళ్లి పీటలెక్కనున్న టీమ్ ఇండియా ప్లేయర్..

  • TGSRTC : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. బస్సు ఛార్జీల తగ్గింపు

  • Wife Kills Husband : ప్రియుడి కోసం భర్తను కడతేర్చిన భార్య.. గుండెపోటు డ్రామా వెనుక భయంకరమైన నిజం

Trending News

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

    • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

    • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

    • టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసిన భార‌త్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd