Dorababu Pendem : వైసీపీ కి రాజీనామా చేసే ఆలోచనలో పిఠాపురం ఎమ్మెల్యే..?
- Author : Sudheer
Date : 12-01-2024 - 11:45 IST
Published By : Hashtagu Telugu Desk
నియోజకవర్గాల ఇంచార్జ్ ల మార్పులు వైసీపీ (YCP) పార్టీని కుదేల్ చేస్తుంది..సర్వేల పేరుతో జగన్ మార్పులు మొదలుపెడితే..పదవి దక్కని నేతలంతా బయటకు వస్తూ షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే అనేక మంది రాజీనామా చేసి టీడీపీ , జనసేన పార్టీలలో చేరగా..మరికొంతమంది ఇదే బాటలో ఉన్నట్లు తెలుస్తుంది. గురువారం సాయంత్రం వైసీపీ మూడో జాబితా రిలీజ్ చేసింది. 21 మందితో కూడిన లిస్ట్ విడుదల చేయగా..అందులో పేర్లు లేని నేతలు పార్టీ మారేందుకు చూస్తున్నారు. వీరిలో పిఠాపురం ఎమ్మెల్యే పెడం దొరబాబు కూడా ఉన్నట్లు తెలుస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
ప్రస్తుతం పెడం దొరబాబు (Dorababu Pendem) పిఠాపురం (Pithapuram ) ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే రానున్న ఎన్నికల్లో దొరబాబుని పక్కన పెట్టి ఆయన స్థానాన్ని కాకినాడ ఎంపీ వంగ గీతకు కేటాయించింది అధిష్టానం. దీంతో ఆయన తీవ్ర అగ్రహానికి గురయ్యారు. త్వరలోనే పార్టీకి రాజీనామా చేయాలనీ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. కాగా ఈ రోజు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గం పిఠాపురం లో ఆత్మీయ సమేవేశాన్ని నిర్వహించనున్నారు. నియోజకవర్గం లోని నాలుగు మండలాలకు చెందిన తన అనుచరులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో సమావేశానికి విచ్చేసిన వారి కోసం ప్రత్యేక విందును ఏర్పాటు చేసి, తన నియోజకవర్గంలో ఉన్న బలాన్ని ప్రదర్శించాలి అని భావిస్తున్నాడు.
Read Also : TDP MLA Candidates First List : టీడీపీ ఫస్ట్ లిస్ట్ అభ్యర్థులు వీరేనా..?