Donkey Running : అనంతపురం జిల్లాలో గాడిదల పరుగు పందేలు..ఇదేం వింత ఆచారం ..!!
అనంతపురం జిల్లాలో గాడిదల పరుగు పందేలు చేపడుతూ ఎప్పటి నుండో వస్తున్న ఆచారాన్ని కొనసాగుతున్నారు
- Author : Sudheer
Date : 29-04-2024 - 7:16 IST
Published By : Hashtagu Telugu Desk
దేశ వ్యాప్తంగా ప్రజలు ఎన్నో సంప్రదాయాలు , కట్టుబాట్లు పాటిస్తుంటారు..అలాగే పలు ఆచారాలను కూడా పాటిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా అనంతపురం జిల్లాలో గాడిదల పరుగు పందేలు చేపడుతూ ఎప్పటి నుండో వస్తున్న ఆచారాన్ని కొనసాగుతున్నారు. మాములుగా కోడి పందేలు , గుర్రుపు పందేలు ఎక్కువగా వింటుంటాం..కానీ ఇక్కడ మాత్రం గాడిదల పరుగు (Donkey Running) పందేలు నిర్వహిస్తుంటారు.
We’re now on WhatsApp. Click to Join.
వివరాల్లోకి వెళ్తే..
అనంతపురం జిల్లా వజ్రకరూర్ (Vajrakarur )లో శ్రీ జనార్ధన వేంకటేశ్వర స్వామి రథోత్సవం సందర్భాంగా ప్రతీ ఏడాది వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా అంతే వైభవంగా జరిగింది. ఈ రథోత్సవంలో గాడిదలకు పరుగు పందెం నిర్వహించడం ప్రత్యేకం. గాడిదలపై వాటి యజమానులు కూర్చొని, వాటిని పరిగెత్తిస్తూ లక్ష్యాన్ని చేరుకోవాలి. ఈ పోటీలో గుర్రాలకు తామేమీ తీసిపోమన్నట్టుగా గాడిదలు పరుగులు తీస్తుంటాయి. ఈ పరుగు పోటీలను తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి జనం తండోపతండాలుగా తరలివస్తుంటారు. ఈ ఏడాది కూడా అలాగే జరుగగా..ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి పందేలను తిలకించారు. వజ్రకరూరు నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరం గాడిదల మీద వెళ్లి తిరిగి వజ్రకరూరుకు వచ్చే విధంగా మొత్తం 18 కిలోమీటర్ల దూరం ఈ రన్నింగ్ పోటీ నిర్వహించారు. పోటీలో గెలిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల కింద నగదు అందజేసి, శాలువా కప్పి సత్కరించారు.
Read Also : Raghunandan Rao : గల్లీలో.. ఢిల్లీలో లేని.. కారును గెలిపిస్తే మిగిలేది శూన్యమే: రఘునందన్ రావు