Digital Payment : వైన్ షాప్ వద్ద చిల్లర కష్టాలకు చంద్రబాబు చెక్
Digital Payment : మద్యం దుకాణాల కంటే బార్లకు సరఫరా చేసే మద్యం ధర 16 శాతం అధికంగా ఉండటం ప్రధాన సమస్యగా అధికారులు గుర్తించారు. అలాగే మొదట పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇవ్వడం, ఆ తర్వాత బార్ల ఏర్పాటుకు అనుమతులు
- By Sudheer Published Date - 01:15 PM, Wed - 17 September 25

ఏపీలో బెల్ట్ షాపుల సమస్యకు అడ్డుకట్ట వేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) తీసుకున్న తాజా నిర్ణయం మద్యం (wine shops) వ్యాపార వ్యవస్థలో కీలక మార్పులకు దారితీయనుంది. ఇకపై అన్ని మద్యం దుకాణాల్లో 100 శాతం డిజిటల్ చెల్లింపుల విధానం తప్పనిసరి కానుంది. నగదు లావాదేవీల వల్లే బెల్ట్ షాపులు పుట్టుకొస్తున్నాయని, అందువల్ల నగదు ప్రదర్శనను పూర్తిగా తగ్గించాలనే ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నట్లు సీఎం స్పష్టం చేశారు. డిజిటల్ చెల్లింపులు తప్పనిసరి చేస్తే ఒకవైపు పారదర్శకత పెరుగుతుందని, మరోవైపు అక్రమ లావాదేవీలకు తావు ఉండదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
మద్యం దుకాణాలకు కేటాయింపులు, బార్ల స్థాపనలో ఎదురవుతున్న సమస్యలపై కూడా సీఎం సమీక్ష జరిపారు. మద్యం దుకాణాల కంటే బార్లకు సరఫరా చేసే మద్యం ధర 16 శాతం అధికంగా ఉండటం ప్రధాన సమస్యగా అధికారులు గుర్తించారు. అలాగే మొదట పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇవ్వడం, ఆ తర్వాత బార్ల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేయడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తాయని అధికారులు వివరించారు. దీనిపై చంద్రబాబు స్పష్టమైన సమీక్ష చేసి, సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని ఆదేశించారు. ఈ విధానం ద్వారా ప్రభుత్వం ఆదాయం పెరగడమే కాకుండా, మద్యం వ్యాపారంలో చట్టబద్ధత, సమతుల్యత సాధించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
Hyderabad : ‘గేట్ ఆఫ్ వరల్డ్’ స్థాయికి హైదరాబాద్ ను తీసుకెళ్తామ్ – సీఎం రేవంత్
అదేవిధంగా రాష్ట్ర ఆదాయ వనరుల విస్తరణపై కూడా సీఎం దృష్టి సారించారు. ఎర్రచందనం ద్వారా ఆశించిన స్థాయి ఆదాయం రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, కొత్త మార్గాలను అన్వేషించాలని సూచించారు. ఎర్రచందనాన్ని నేరుగా అమ్మడం కాకుండా, తిరుపతి డిపోలోనే చెక్క బొమ్మలు, కళాకృతులు తయారు చేసి విక్రయిస్తే అధిక లాభాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) వృద్ధికి అనుగుణంగా ప్రభుత్వ రాబడి కూడా పెరగాలని, ఈ బాధ్యతను జిల్లా కలెక్టర్లు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ చర్యలన్నీ కలిసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా, ప్రజలకు సమాన అవకాశాలు, పారదర్శక పాలన అందించాలన్న సంకల్పాన్ని ప్రతిబింబిస్తున్నాయి.