TDP vs Janasena: టీడీపీ-జనసేన మధ్య విభేదాలు?
టీడీపీ, జనసేన మధ్య విభేదాలు ఉన్నాయా? ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు వెంటే ఉన్నాడు. .అయితే పవన్ మాత్రం టీడీపీపై కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. సీట్ల పంపకం విషయంలో వారి మధ్య సయోధ్య కుదరలేదా
- By Praveen Aluthuru Published Date - 10:33 AM, Mon - 18 December 23

TDP vs Janasena: టీడీపీ, జనసేన మధ్య విభేదాలు ఉన్నాయా? ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు వెంటే ఉన్నాడు. .అయితే పవన్ మాత్రం టీడీపీపై కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. సీట్ల పంపకం విషయంలో వారి మధ్య సయోధ్య కుదరలేదా అంటే అవును అనే అంటున్నారు . తాజాగా పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు వెళ్లడం వారి బంధంలో ఉన్న వ్యత్యాసానికి అద్దం పడుతోంది.ప్రధానంగా పవన్ కళ్యాణ్ లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు రానని చెప్పారు. సీట్ల సర్దుబాటు విషయంలో తమ మధ్య విభేదాలు రావడంతో లోకేష్ సభకు రావడం లేదని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
పరిస్థితి చేజారుడుతుండటంతో స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగారు. చంద్రబాబు దిగివచ్చి ఆయనను బుజ్జగించేందుకు మాదాపూర్‌లోని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. తెలంగాణలో ఏపీ రాజకీయాలపై చంద్రబాబు-పవన్ కళ్యాణ్ చర్చిస్తున్నారు. సీట్ల పంపకాలపై ప్రధానంగా పవన్-చంద్రబాబు చర్చించినట్లు సమాచారం. సీట్ల సర్దుబాటు చేస్తాం.. కానీ లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు రావాలని చంద్రబాబు పవన్‌ని కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జనసేనకు 24 నుంచి 28 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు కేటాయించబోతున్నట్టు పవన్ కు చెప్పారట. దీనిపై పవన్ కూడా సముఖత వ్యక్తం చేసినట్లు జనసేన వర్గాలు చెప్తున్నాయి. దీంతో టీడీపీ, జనసేన ఎండ్ కార్డు ఎలా ఉండబోతుందో ఆసక్తికరంగా మారింది.
ఏదేమైనా ఇరు పార్టీల ద్వేయం జగన్ ని గద్దె దించడమే. తాను సీఎం అవ్వకపోయినా పర్లేదు కాదు జగన్ సీఎం అవ్వడానికి వీల్లేదంటూ పవన్ గతంలో బాహాటంగానే చెప్పాడు. దీనిపై కాస్త విమర్శలు ఎదురయ్యాయి. లక్షలాది మంది జనసైనికులు సీఎంగా చూడాలని అనుకుంటున్న తరుణంలో పవన్ చంద్రబాబును సీఎం చేసేందుకు రాజకీయాలు చేస్తున్నారని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో జనసైనికులు సైతం పవన్ పై అసంతృప్తిగానే ఉన్నారు.
Also Read: BJP : బిజెపి సోషల్ ఇంజనీరింగ్