OG Trailer : OG ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్
OG Trailer : సుజీత్ డైరెక్షన్, పవన్ యాక్షన్, థమన్ మ్యూజిక్ ఈ మూడు కలిస్తేనే సినిమా పెద్ద విజయాన్ని సాధించగలదనే అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మాస్ ఇమేజ్‌కి కొత్త మలుపు తిప్పే సినిమా ‘OG’ అవుతుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది
- By Sudheer Published Date - 04:54 PM, Thu - 18 September 25
 
                        పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘OG’ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తాజాగా ట్రైలర్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈనెల 21వ తేదీ ఉదయం 10.08 గంటలకు ట్రైలర్ విడుదల చేయనున్నట్లు పోస్టర్ ద్వారా వెల్లడించారు. దీంతో పవర్‌స్టార్ అభిమానుల్లో ఆనందం మొదలైంది. ‘OG’ సినిమాను ఈనెల 25న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న థమన్ ఇప్పటికే విడుదల చేసిన టీజర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తోనే మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నారు. ట్రైలర్‌లో మ్యూజిక్, పవన్ లుక్ కలిపి మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించేలా ఉంటుందని మేకర్స్ నమ్ముతున్నారు.
TVK Leader Vijay : ఎక్కడి నుండి పోటీ చేయాలో విజయ్ ఇంకా ఫిక్స్ కాలేదా..?
అలాగే ఈ సినిమా విడుదలకు ముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మరో ముఖ్యాంశం. పవన్ కళ్యాణ్ సినిమా కావడంతో భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉన్నందున, అదనపు షోస్, టికెట్ రేట్ల పెంపు వంటి సౌకర్యాలను కల్పించేందుకు అధికారిక అనుమతులు ఇవ్వడం జరిగింది. ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ట్రేడ్ వర్గాల్లోనూ ఈ వార్త పాజిటివ్‌గా మారింది. అయితే తెలంగాణలో ధరలు పెంచేందుకు అనుమతులు వస్తాయా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. అక్కడి పరిస్థితిని బట్టి కలెక్షన్లలో తేడాలు వచ్చే అవకాశముంది.
సుజీత్ డైరెక్షన్, పవన్ యాక్షన్, థమన్ మ్యూజిక్ ఈ మూడు కలిస్తేనే సినిమా పెద్ద విజయాన్ని సాధించగలదనే అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మాస్ ఇమేజ్‌కి కొత్త మలుపు తిప్పే సినిమా ‘OG’ అవుతుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రైలర్ రాకముందే అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ట్రైలర్‌లో పవన్ మాస్ డైలాగ్స్, స్టైలిష్ యాక్షన్ సీన్స్ ఉంటే, సినిమా రిలీజ్‌కు ముందు నుంచే బాక్సాఫీస్ హిట్ టాక్ మొదలయ్యే అవకాశం ఉంది. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందన్నది చూడాల్సి ఉంది.
Kalki 2898 AD : కల్కి టీం కు షాక్ ఇచ్చిన దీపిక..నెక్స్ట్ ఎవరు..?
 
                    



