Delhi Deal : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన `కేస్` స్టడీ
ఏసీ సీఎం ఢిల్లీ పర్యటన(Delhi Deal)ఆయనపై ఉన్న కేసుల వ్యవహారం వస్తోంది.
- By CS Rao Published Date - 12:50 PM, Tue - 27 December 22

ఏసీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన(Delhi Deal) సందర్భంగా ఆయనపై ఉన్న కేసుల(Cases) వ్యవహారం బయటకు వస్తోంది. ప్రధానంగా ఆయన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య తెరమీద కనిపిస్తోంది. కేసు విచారణలో సీబీఐ స్పీడు పెంచడంతో పాటు చివరి దశకు తీసుకొచ్చింది. దాన్నుంచి బయట పడేందుకు మంగళవారం ఢిల్లీ వెళ్లి (Delhi Deal) బీజేపీ పెద్దల సహాయసహకారాల కోరనున్నారని ప్రచారం మొదలయింది. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. కానీ, సీఎం హోదాలో ఉన్న ఆయన ఏపీ నుంచి హైదరాబాద్ కు రావాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఆ అంశాన్ని ఫోకస్ చేయడం ద్వారా వ్యక్తిగత హాజరు నుంచి మినయింపు పొందారు.
Also Read : Jagan Delhi Tour: జగన్ ఢిల్లీ టూర్, పొలిటికల్ చేంజ్
కోర్టుల్లోని కేసుల(Cases) విచారణ ఆపేందుకు ఢిల్లీ పెద్దల సహకారం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నారని తొలి నుంచి ఆయన మీద ఉన్న ఆరోపణ. ఏపీ సీఎం అయిన తొలి రోజుల్లో మోడీ, అమిత్ షా అపాయిట్మెంట్ కు ప్రయత్నం చేసినప్పటికీ లభించలేదు. తొలుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అపాయిట్మెంట్ ను సాధించగలిగారు. ఆ తరువాత కొన్ని నెలల పాటు ప్రయత్నం చేసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయిట్మెంట్ ను జగన్మోహన్ రెడ్డి పొందారు. మూడున్నరేళ్లలో రెండేసార్లు అమిత్ షాను కలవడానికి ఆయనకు అవకాశం లభించింది. కానీ, మోడీ మాత్రం తరచూ అపాయిట్మెంట్ లు ఇస్తున్నారు. పీఎంవో ఆఫీస్ లో ఎంపీ సాయిరెడ్డి చేస్తోన్న లాబీయింగ్ మోడీ విషయంలో పనిచేస్తుందని ఢిల్లీ వర్గాల టాక్.
సాధారణంగా రాజకీయాలు, కేసుల విషయాలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళతారని బీజేపీ వర్గాల్లోని చర్చ. కానీ, ప్రధాని మోడీ ద్వారా ఏపీ జగన్మోహన్ రెడ్డి ఆయన వ్యక్తిగత అంశాలను డీల్ చేసుకుంటున్నారని ఆ పార్టీ అంతర్గత వర్గాల్లోని వినికిడి. ఏపీకి ప్రధాని వచ్చిన సందర్భంగా భీమవరం, విశాఖ వేదికగా మోడీ, జగన్మోహన్ రెడ్డి మధ్య ఉన్న అప్యాయతలు జనం చూశారు. రాజకీయాలకు అతీతంగా మోడీతో ఆత్మీయబంధం ఉందని జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఆ బంధంతో రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చిన దాఖలాలు లేవు.
జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళుతోన్న సందర్భంగా..(Delhi Deal)
ఏపీ విడిపోయిన తరువాత ఉమ్మడి ఆస్తుల విభజన జరగలేదు. సుమారు 6లక్షల కోట్ల విలువైన సంపద తెలంగాణ భూభాగంలో పంపకానికి నోచుకోకుండా ఉండిపోయింది. దాని పరిష్కారానికి కేంద్రం అందించిన సహకారం శూన్యం. ఇక పోలవరం, రాజధాని, విశాఖ రైల్వే జోన్, ఆర్థికలోటు తదితర అంశాల పరిష్కారానికి కేంద్రం ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వడంలేదు. వీటి గురించి ఢిల్లీ వెళ్లిన ప్రతి సందర్భంలోనూ వినతపత్రాన్ని అందించడం వరకు పరిమితమై, ఆ తరువాత స్వప్రయోజనాల గురించి మాట్లాడుకుంటున్నారని సర్వత్రా వినిపిస్తోంది.
లిక్కర్ స్కామ్ విచారణ వేగవంతంగా జరుగుతోంది. దానిలో ఏపీకి చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి బంధువలు ప్రమేయం ఉందని రిమాండ్ రిపోర్ట్ ద్వారా తేలింది. ఆ కేసు విచారణ తెలంగాణ నుంచి ఏపీ వరకు తాకింది. ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళుతోన్న సందర్భంగా ఆయనపై ఉన్న కేసులు, అప్పు అంశాలు ప్రస్తావనకు వస్తాయని పలువురు విశ్వసిస్తున్నారు. ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళుతోన్న సందర్భంగా ఆయనపై ఉన్న కేసులు, అప్పు అంశాలు ప్రస్తావనకు వస్తాయని పలువురు విశ్వసిస్తున్నారు. వీటికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఉంటే అనూహ్యమే.
Also Read : Babu-Jagan: హస్తినలో ఏపీ హీట్! ఢిల్లీకి బాబు, జగన్!!