Borugadda Anil Kumar : పోలీస్‌స్టేషన్‌లో బోరుగడ్డకు రాచమర్యాదలు..శభాష్ పోలీస్ అన్నలు
Borugadda Anil Kumar : పడుకోవడాని సైతం ప్రత్యేకంగా బల్ల, దుప్పట్లు, దిండ్లు వేసి, వాటర్ బాటిల్స్ చేతికి ఇచ్చి సకల మర్యాదలు చేసారు. దీనికి సంబంధించి వీడియోస్ ఇప్పుడు బయటకు రావడం తో యావత్ ప్రజలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
- By Sudheer Published Date - 02:36 PM, Sat - 9 November 24

బోరుగడ్డ అనిల్ (Borugadda Anil Kumar)కు పోలీసులు (Police) రాచ మర్యాదలు చేయడంపై యావత్ తెలుగు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ..శభాష్ పోలీస్ అన్నలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. జగన్ అండ చూసుకొని బోరుగడ్డ అనిల్ ఎంత రెచ్చిపోయాడో చిన్న పిల్లాడిని అడిగిన చెపుతారు..నోటికి ఏది వస్తే అది..ఓ మంచి మర్యాద లేకుండా చంద్రబాబు దగ్గరి నుండి కిందిస్థాయి నేతల వరకు మహిళలు అనే గౌరవం కూడా లేకుండా వారిపై కూడా బూతుల వర్షం కురిపించిన ఓ నీచుడికి..పోలీసులు సకల మర్యాదలు చేయడం పోలీస్ వ్యవస్థ పైనే ఛీ కొట్టేలా చేసారు కొంతమంది పోలీసులు.
జగన్ అండచూసుకొని రెచ్చిపోయిన వారందర్ని కటకటాల్లోకి నెట్టేస్తుంది కూటమి సర్కార్..ఇప్పటికే అనేక మందిపై కేసులు నమోదు చేయగా..వారిలో అనిల్ కూడా ఉన్నాడు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బోరుగడ్డపై నమోదైన కేసుల్లో అరెస్టు చేయడం, కోర్టులో హాజరుపర్చడం, అనంతరం రిమాండ్ కు పంపడం చేసారు. ఇదే క్రమంలో ఇదే బ్లాక్ మెయిలింగ్ కేసులో కోర్టు అనుమతి మేరకు మూడు రోజుల పాటు గుంటూరు పోలీసులు ఆయన్ను కస్డడీలోకి తీసుకున్నారు. గత నెల 26 నుంచి 29 వరకు బోరుగడ్డ అనిల్ కుమార్ ను కస్టడీలోకి తీసుకొని ఆరండల్ పేట పోలీసులు విచారించారు.
ఈ సమయంలో బోరుగడ్డను పోలీసులు ఏం ప్రశ్నించారో తెలియదు కానీ రాచమర్యాదలు మాత్రం గట్టిగానే చేశారు. సాక్షాత్తు కుర్చీలు వేసి దగ్గరుండి మరీ అన్నం వడ్డించారు. అంతే కాదు కూర్చోవడానికి స్టేషన్లో రైటర్ సీట్ కేటాయించారు. ఇంతటితో ఆగకుండా పడుకోవడాని సైతం ప్రత్యేకంగా బల్ల, దుప్పట్లు, దిండ్లు వేసి, వాటర్ బాటిల్స్ చేతికి ఇచ్చి సకల మర్యాదలు చేసారు. దీనికి సంబంధించి వీడియోస్ ఇప్పుడు బయటకు రావడం తో యావత్ ప్రజలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్య ప్రజలు ఏ నేరం చేయకున్నప్పటికీ..వారిని చితకబాదే పోలీసులు..ఓ నేరస్థుడు..ఓ సైకో కు ఇలా సకల మర్యాదలు చేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అనిల్ కు బిర్యానీ వడ్డించి పెట్టారని చెప్పి.. ఏకంగా ఏడుగురు పోలీసులను గుంటూరు ఎస్పీ సస్పెండ్ చేసినప్పటికీ..ఇంకా కొంతమంది పోలీసులకు బుద్ది రాలేదని..గత ప్రభుత్వంలో గట్టిగానే లంచాలు తీసుకోని..ఇప్పుడు వారికీ సేవలు చేస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
One more case filed on Borugadda Anil for abusing @naralokesh and @ncbn
But wait …
పోలీస్ స్టేషన్ లోనే బోరుగడ్డకు బెడ్డు, పరుపు మరియు దుప్పట్లు అందించిన పోలీసులు along with biriyani packetspic.twitter.com/hp6GSiIBty
— V@ndeM@t@r@m (@patriotatwork99) November 9, 2024
Read Also : Putin : ‘సెక్స్ మంత్రిత్వ శాఖ’.. శోభనానికి, డేటింగ్‌కు ఆర్థికసాయం ! ?