CBN Arrest – A Conspiracy : విజయవాడకు చంద్రబాబు తరలింపు.. ఓర్వకల్లు ఎయిర్ పోర్టులో ముందుగానే హెలికాప్టర్ ?
CBN Arrest - A Conspiracy : స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసు (29/2021)లో చంద్రబాబును అకస్మాత్తుగా అరెస్టు చేసిన పోలీసులు ఆయనను విజయవాడకు తరలించాలని నిర్ణయించారు.
- Author : Pasha
Date : 09-09-2023 - 7:17 IST
Published By : Hashtagu Telugu Desk
CBN Arrest – A Conspiracy : స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసు (29/2021)లో చంద్రబాబును అకస్మాత్తుగా అరెస్టు చేసిన పోలీసులు ఆయనను విజయవాడకు తరలించాలని నిర్ణయించారు. తొలుత ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు తీసుకెళ్లి, అక్కడి నుంచి విజయవాడకు తీసుకెళ్తారని తెలుస్తోంది. చంద్రబాబును విజయవాడకు తీసుకెళ్లేందుకు ఓర్వకల్లు ఎయిర్ పోర్టులో హెలికాప్టర్ ను రెడీగా ఉంచారు. రోడ్డు మార్గంలో తీసుకెళ్తే టీడీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేయొచ్చని భావిస్తున్న నేపథ్యంలో గగనతల మార్గంలో బాబును తరలించేందుకు జగన్ సర్కారు ప్లాన్ చేసింది. చంద్రబాబు అరెస్టు కంటే ముందుగానే ఓర్వకల్లు ఎయిర్ పోర్టులో హెలికాప్టర్ ను రెడీగా ఉంచడాన్ని బట్టి .. కుట్రపూరితంగా, ముందస్తు ప్లాన్ తోనే చంద్రబాబును అరెస్టు చేశారనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే అరెస్టుకు గల కారణాలను మాత్రం చంద్రబాబుకు ఏపీ పోలీసులు చెప్పకపోవడం గమనార్హం. కనీసం స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కు సంబంధించిన ప్రాథమిక ఆధారాలను కూడా చంద్రబాబుకు చూపించలేదు. ఈవిధంగా టీడీపీ చీఫ్ ను అరెస్టు చేయడం అన్యాయమని పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. వెంటనే చంద్రబాబును విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అంతకుముందు శనివారం తెల్లవారుజామున 3 గంటల నుంచి చంద్రబాబు అరెస్టుకు నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద పోలీసులను వందలాదిగా మోహరించి హైడ్రామా చేశారు.