Jagan : రేపు అన్నమయ్య, కడప జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన
రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం జగన్.. మధ్యాహ్నం 12 గంటలకు రాయచోటిలో శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ జకియా ఖానం కుమారుడి వివాహ వేడుకలో పాల్గొంటారు
- By Sudheer Published Date - 08:58 PM, Wed - 8 November 23

సీఎం జగన్ (CM Jagan) రేపు , ఎల్లుండి అన్నమయ్య, కడప జిల్లాల్లో (annamayya kadapa district) పర్యటించబోతున్నారు. ఈ మేరకు జగన్ పర్యటన కు సంబదించిన వివరాలు అధికారికంగా ప్రకటించారు. రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం జగన్.. మధ్యాహ్నం 12 గంటలకు రాయచోటిలో శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ జకియా ఖానం కుమారుడి వివాహ వేడుకలో పాల్గొంటారు. ఆ తర్వాత మాజీ ఎంపీపీ కుటుంబ సభ్యల వివాహ వేడుకలో పాల్గొంటారు.
We’re now on WhatsApp. Click to Join.
అక్కడి నుంచి బయలుదేరి పులివెందుల చేరుకుని శ్రీకృష్ణుడి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొని, ఆ తర్వాత పులివెందుల శిల్పారామాన్ని ప్రారంభిస్తారు. అనంతరం శ్రీ స్వామి నారాయణ్ గురుకుల్ స్కూల్‌కు శంకుస్ధాపన కార్యక్రమం, ఆ తర్వాత ఏపీ కార్ల్ ప్రాంగణంలో అగ్రికల్చర్, హార్టికల్చర్ కళాశాలలు, స్టేట్ ఆఫ్ ఆర్ట్ సెంట్రల్ టెస్టింగ్ లేబరేటరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్ ల్యాబ్‌లు ప్రారంభోత్సవం, ఆదిత్య బిర్లా యూనిట్ విజిట్, ఆ తర్వాత సీవీ సుబ్బారెడ్డి నివాసానికి వెళతారు. అక్కడినుంచి బయలుదేరి ఇడుపులపాయ చేరుకుని వైస్సార్ ఎస్టేట్ గెస్ట్‌హౌస్‌లో రాత్రికి బస చేస్తారు.
ఎల్లుండి ఉదయం ఉదయం 8.30 గంటలకు ఇడుపులపాయలో ఆర్ కే వ్యాలీ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఎకో పార్క్ వద్ద వేముల మండలం ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్ననికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
Read Also : Delhi Liquor Scam: కవిత అరెస్ట్ ఖాయం.. ఆమెను ఎవరూ రక్షించలేరు