Rapaka Varaprasad: సీఎం జగన్ దంపతులపై రాపాక క్రేజీనెస్
సీఎం జగన్ దంపతులపై జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మరోసారి తన ప్రేమను చాటుకున్నాడు. తన కుమారుడి వివాహ వేడుకకు హాజరవ్వాల్సిందిగా సీఎం జగన్ దంపతులకు ఆహ్వాన పత్రిక అందజేశాడు
- Author : Praveen Aluthuru
Date : 20-05-2023 - 5:36 IST
Published By : Hashtagu Telugu Desk
Rapaka Varaprasad: సీఎం జగన్ దంపతులపై జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మరోసారి తన ప్రేమను చాటుకున్నాడు. తన కుమారుడి వివాహ వేడుకకు హాజరవ్వాల్సిందిగా సీఎం జగన్ దంపతులకు ఆహ్వాన పత్రిక అందజేశాడు. అయితే ఇక్కడే రాపాక తన క్రేజీనెస్ ప్రదర్శించాడు. తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికపై సీఎం జగన్, భారతి ఫొటోలతో ఆహ్వాన పత్రికను ముద్రించాడు. ప్రస్తుతం రాపాక ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
రాపాక వరప్రసారావు , నాగరత్నం దంపతుల కుమారుడి వివాహం జూన్ 7న రాత్రి 1:02 గంటలకు జరగనుంది. కావున మా దైవ సమానులైన ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్, భారతి గార్ల ఆశిస్సులతో అంటూ వివాహ ఆహ్వాన పత్రికపై అచ్చు వేయించాడు. ప్రస్తుతం ఈ ఆహ్వాన పత్రిక వైరల్ గా మారింది. సోషల్ మీడియా వేదికగా ఎవరికీ వారు స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
రాపాక కుమారుడి పెళ్లి ఆహ్వాన పత్రికపై వైసీపీ నేతలు, కార్యకర్తలు పాజిటివ్ గా రియాక్ట్ అవుతుండగా… జనసేన నేతలు మాత్రం రాపాక తీరుని ఎండగడుతున్నారు. జనసేన ఎమ్మెల్యే అయి ఉండి వైసీపీ నేతల కంటే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నావు,,,, చిత్తశుద్ధి లేదా నీకు అంటూ సోషల్ మీడియా వేదిక ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా.. జనసేన తరుపున గెలిచిన రాపాక కొంతకాలానికే వైసీపీకి సపోర్టుగా మారారు. పార్టీ మారనప్పటికీ ఆయన సీఎం జగన్ పై ప్రశంసలు కురిపిస్తూ జనసేనకు వ్యతిరేకిగా మారాడు.
Read More: Dark Politics : తెలంగాణ `ఫిక్సింగ్` రాజకీయం