CM in Tirumala: శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు
రాత్రి 7:30 గంటల ప్రాంతంలో, చంద్రబాబు తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి బేడీ ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు.
- By Dinesh Akula Published Date - 10:42 PM, Wed - 24 September 25

తిరుమల, సెప్టెంబర్ 24: (CM in Tirumala)- తిరుమలలో బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్న వేళ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబసమేతంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
తిరుమలలో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.
🙏 ముఖ్యమంత్రి హోదాలో రికార్డు స్థాయిలో 15వ సారి పట్టువస్త్రాలు సమర్పించే భాగ్యాన్ని పొందారు.
సతీసమేతంగా మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించిన సీఎం గారి వెంట మంత్రి నారా… pic.twitter.com/6RvS5ll13y
— B R Naidu (@BollineniRNaidu) September 24, 2025
రాత్రి 7:30 గంటల ప్రాంతంలో, చంద్రబాబు తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి బేడీ ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆలయం వరకూ పాదయాత్రగా వెళ్ళి, స్వామివారిని దర్శించి పట్టువస్త్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్, ఆయన భార్య నారా బ్రాహ్మణి కూడా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించారు.
వీరి రాక సందర్భంగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గాయత్రి నిలయం వద్ద ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం టీటీడీ అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈరోజు బ్రహ్మోత్సవాల్లో పెద్దశేషవాహన సేవ ప్రముఖ ఉత్సవంగా జరగనుంది.
ఇక బ్రహ్మోత్సవాల ప్రారంభానికి గుర్తుగా జరిగే ధ్వజారోహణం బుధవారం ఉదయం ఘనంగా నిర్వహించబడింది. ఇందులో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామికి ఏకాంతంగా తిరుమంజనం, నైవేద్యం జరిగాయి.
ధ్వజారోహణ సందర్భంలో, గరుడ పతాకాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి, ఉత్సవమూర్తుల సమక్షంలో ధ్వజస్తంభంపై ఎగురవేశారు. ఇది బ్రహ్మోత్సవాలకు దేవతలకు పంపించే ఆహ్వానంగా పరిగణించబడుతుంది. ఈ వేడుకతో బ్రహ్మోత్సవాల పర్వదినాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి.