Good News : స్కూలు విద్యార్థులకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు
Good News : ఈ నిర్ణయంతో విద్యార్థుల ఆరోగ్యం, విద్యా పరిస్థితుల అభివృద్ధికి మరింత తోడ్పాటు కలిగే అవకాశం ఉంది
- By Sudheer Published Date - 08:53 PM, Fri - 14 February 25

ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu ) శుభవార్త ప్రకటించారు. రాష్ట్రంలోని BC విద్యార్థుల కోసం రూ.110.52 కోట్ల డైట్ బకాయిలు, రూ.29 కోట్ల కాస్మోటిక్ బిల్లులను చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయంతో విద్యార్థుల ఆరోగ్యం, విద్యా పరిస్థితుల అభివృద్ధికి మరింత తోడ్పాటు కలిగే అవకాశం ఉంది. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 660 హాస్టళ్లలో చేపట్టిన మరమ్మతులను వేగంగా పూర్తి చేయాలని సీఎం సూచించారు. దాదాపు రూ.13.10 కోట్ల వ్యయంతో ఈ పనులు జరుగుతున్నాయి. 6 వారాల్లో వీటిని పూర్తిచేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. విద్యార్థులకు మరింత మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
Kiccha Sudeep : జీ5లో కిచ్చా సుదీప్ ‘మ్యాక్స్’.. ఎప్పటినుంచంటే…!
విద్యార్థుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, హాస్టళ్లలో అవసరమైన ట్రంక్ పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు, కిచెన్ ఐటెమ్స్ అందించాలనే నిర్ణయం తీసుకున్నారు. హాస్టళ్లలో తినుబండారాల సరఫరా మెరుగుపడేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. విద్యార్థుల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. నసనకోట, ఆత్మకూరు BC సంక్షేమ బాలికల పాఠశాలలను రెసిడెన్షియల్ కాలేజీలుగా మార్పు చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్పుతో విద్యార్థులకు అధునాతన వసతులు, ఉన్నత విద్యకు మరింత అవకాశాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.