HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cm Chandrababu Nadu Speech In Mahanadu

Mahanadu : కడపలో ఈమహానాడు చరిత్ర సృష్టించనుంది: సీఎం చంద్రబాబు

ఇది ప్రత్యేకమైన మహానాడు. తొలిసారిగా కడప గడ్డపై మహానాడు నిర్వహిస్తున్నాం. ఇది కేవలం సమారోహం మాత్రమే కాదు, భవిష్యత్తు దిశను నిర్ణయించే వేదిక అని ఆయన హితవు పలికారు.

  • Author : Latha Suma Date : 27-05-2025 - 12:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Chandrababu Nadu Speech in mahanadu
CM Chandrababu Nadu Speech in mahanadu

Mahanadu :   దేవునికడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు మహోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ, ఈ మహానాడు తెలుగుదేశం చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఇది ప్రత్యేకమైన మహానాడు. తొలిసారిగా కడప గడ్డపై మహానాడు నిర్వహిస్తున్నాం. ఇది కేవలం సమారోహం మాత్రమే కాదు, భవిష్యత్తు దిశను నిర్ణయించే వేదిక అని ఆయన హితవు పలికారు. ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీ ఇప్పటికే పదింటికి ఏడు స్థానాలు గెలవగలిగిందని, వచ్చే ఎన్నికల్లో పదింటికి పది సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

2024 ఎన్నికల్లో సాధించిన విజయం అసాధారణం. 93 శాతం స్ట్రైక్‌రేట్‌తో దేశాన్ని ఉలిక్కిపడేలా చేశాం. ఈ విజయం మా కార్యకర్తల త్యాగాల ఫలితం. ఎవ్వరూ ఆశించకుండా పార్టీ జెండా మోస్తున్న పసుపు సైనికులే మన విజయానికి మూల కారకం. జనసేన, బీజేపీతో మైత్రీలో భాగంగా నిలబడి పనిచేసిన కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అని అన్నారు. పార్టీ ముగిసిపోయిందని వ్యాఖ్యానించినవారిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వాళ్లే ఇక రాజకీయంగా ముగిసిపోయారు అని చంద్రబాబు పేర్కొన్నారు. గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న తెలుగుదేశం పార్టీ, ఈ దేశ రాజకీయాల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించిందని ఆయన గుర్తుచేశారు. గత ప్రభుత్వ పాలనను విమర్శిస్తూ వైసీపీ పాలన రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసింది. కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారు, ప్రాణాలను బలిగొన్నారు. అయినా కూడా తలవంచకుండా పోరాడిన మీ అందరినీ అభినందిస్తున్నాను అని పేర్కొన్నారు.

తెలుగుదేశం కార్యకర్త చంద్రయ్య ధైర్యాన్ని గుర్తుచేస్తూ అతడిని పీక కోస్తున్నా చివరి శ్వాస వరకు జై తెలుగుదేశం అన్నాడు. ఆయన మనకు స్ఫూర్తి అని చంద్రబాబు భావోద్వేగంతో చెప్పారు. పార్టీని విశ్వసించిన ప్రజలకు మంచి పాలన అందించడమే ధ్యేయంగా నిలిచామని తెలిపారు. ప్రతిపక్షంలో అవినీతిపై పోరాడాం. అధికారంలో ఉన్నప్పుడు అవినీతి రహిత పాలనను అందించాం. ప్రజల ఆస్తులు, హక్కులు కాపాడాం. తెలుగు రాజకీయాల్లో విలువలు, ఆచారాలు కల్పించిన ఏకైక పార్టీ తెలుగుదేశమే. రాష్ట్రంలోని ఇతర పార్టీల్లోనూ మన పార్టీ విద్యార్థులే ప్రధాన పాత్రలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ చరిత్రను చెరిపేయాలనుకునే ప్రయత్నాలు ఫలించవు. ఇది కాగితంపై రాసినది కాదు, ప్రజల గుండెల్లో చెక్కిన చరిత్ర అని అన్నారు. ఈ మహానాడు ద్వారా పార్టీ ముందున్న లక్ష్యాలను స్పష్టంగా ప్రకటించి, భవిష్యత్తుకు బలమైన మార్గసూచిని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు తన ప్రసంగం ముగించారు.

Read Also: Amazon : అమెజాన్‌లో అబ్బురపరిచిన దృశ్యం.. నదిలో భారీ సర్పాలు? వీడియో చూసి షాక్‌

 

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Chandrababu
  • history
  • Kadapa
  • mahanadu
  • telugu desam party

Related News

HBDOneAndOnlyCBN

HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

Nara Bhuvaneswari  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు 76వ పుట్టినరోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. తన భర్త పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన భార్య నారా భువనేశ్వరి ఎక్స్ వేదికగా ప్రేమపూర్వకమైన శుభాకాంక్షలు తెలిపారు.”నా కోసం ఈ రోజు పుట్టావు. కోట్లాది మంది కోసం జీవించావు. మీలో సగమై.. మీ కృషిలో భాగమై.. నా స్వేచ్ఛా స్వతంత్ర సేవా సాధికార మార్గదర్శి.. పుట్టినరోజు శుభాకాంక్షలు.. మ

  • Jr Ntr Birthday Wishes To C

    Jr NTR: మామయ్యకు జూనియర్ ఎన్టీఆర్ విషెస్

  • PM Modi wishes Andhra Pradesh CM Chandrababu Naidu

    చంద్రబాబుకు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్

  • Nara Lokesh garu met Punarvika's family after she received an injection today

    Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

  • nara lokesh with pawan kalyan

    నారా లోకేష్‌కు శుభాకాంక్షలు చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd