HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cm Chandrababu Good News For Pensioners

Chandrababu : పింఛన్‌దారులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

ఎన్నికల్లో ఇచ్చినట్లుగానే సీఎం హోదాలో మెుదట మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై రెండో సంతకం, పింఛను రూ.4 వేలకు పెంచుతూ మూడో సంతకం, స్కిల్ సెన్సెస్‌, అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై సంతకాలు చేశారు

  • Author : Sudheer Date : 13-06-2024 - 8:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cm Chandrababu Good News Fo
Cm Chandrababu Good News Fo

ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu ) రాష్ట్ర పింఛన్‌దారులకు (Pensioners) తీపి కబురు తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు జూన్ 1న పెంచిన పింఛన్ ను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు మంత్రి నిమ్మల రామానాయుడు మీడియా తో తెలిపారు. బుధువారం ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు..ఈరోజు రాష్ట్ర సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఉన్న సీఎం ఛాంబర్‌లో ఈ సాయంత్రం 4:41 నిమిషాలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీల అమలుపై సంతకాలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చినట్లుగానే సీఎం హోదాలో మెుదట మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై రెండో సంతకం, పింఛను రూ.4 వేలకు పెంచుతూ మూడో సంతకం, స్కిల్ సెన్సెస్‌, అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై సంతకాలు చేశారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు, 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ సీఎం మొదటి సంతకం చేశారు. కేటగిరిల వారీగా పోస్టుల వివరాలు… ఎస్‌జీటీ 6,371, పీఈటీ 132, స్కూల్‌ అసిస్టెంట్స్‌ 7725, టీజీటీ 1781, పీజీటీ 286, ప్రిన్సిపల్స్‌ 52 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రజలను అత్యంత భయకంపితుల్ని చేసిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దుపై సీఎం చంద్రబాబు రెండో సంతకం చేశారు.

2014లో అధికారంలోకి రాగానే చంద్రబాబు అప్పటికి రూ.200 ఉన్న పింఛన్‌ను 5 రెట్లు పెంచి వెయ్యి రూపాయలు చేశారు. ఆ తర్వాత దాన్ని 2 వేలకు పెంచారు. 2024 ఎన్నికల ప్రచారంలో 4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అంతేకాదు ఏప్రిల్‌ నుంచి పెంచిన పింఛన్‌ను వర్తింపజేస్తామని ప్రకటించారు. దివ్యాంగులకు పింఛన్‌ను రూ. 6 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. పింఛన్‌ పెంపు హామీలను నెరవేరుస్తూ చంద్రబాబు మూడో సంతకం చేశారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, తదితర విభాగాల వారికి జులై 1న, కొత్తగా పెంచిన పింఛన్‌ 4 వేలు, అలాగే ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు గాను వెయ్యి రూపాయల చొప్పున పెరిగిన మొత్తం రూ. 3 వేలు కలిపి రూ. 7 వేల పింఛన్‌ను అందించనున్నారు. ఆగస్టు నుంచి లబ్దిదారులకు 4 వేల రూపాయల పింఛన్‌ అందనుంది.

అలాగే పేదలకు రూ. 15కే కడుపునిండా భోజనం పెట్టె అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 183 అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. అల్పాహారం, భోజనాన్ని 5 రూపాయలకే అందించారు. సగటున రోజుకు రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల మంది అల్పాహారం, భోజనం తినేవారు. ఇందుకుగాను అప్పటి టీడీపీ ప్రభుత్వం సుమారు 31 కోట్లు ఖర్చుచేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్..అన్న క్యాంటీన్లు మూసివేయించారు. అయినా టీడీపీ నేతలు పలుచోట్ల అన్న క్యాంటీన్లను నిర్వహించారు. అధికారం చేపట్టిన వెంటనే వీటిని పునరుద్ధరిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇక ఇప్పుడు చెప్పినట్లే అన్న క్యాంటీన్ల దస్త్రంపై సీఎం చంద్రబాబు సంతకం పెట్టారు.

Read Also : Oracle : 2లక్షల విద్యార్థులకు క్లౌడ్, AI టెక్‌లో శిక్షణనిస్తున్న ఓరాకిల్‌


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • chandrababu
  • Pensioners

Related News

Gade Venkatreddy

Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు గాదె వెంకటరెడ్డి (86) శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్యంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గాదె వెంకటరెడ్డి మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, వివిధ పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ఆయన అందించిన సేవ

  • Tdp Mla Bandaru Sravani

    Mahanadu : మహిళా సాధికారతే టీడీపీ లక్ష్యం.. మహానాడులో ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి

  • ACB raids

    ACB Raids : మాజీ ఏపీ భవన్ అధికారి ఇళ్ల‌లో ఏసీబీ సోదాలు.. కోట్ల విలువైన అక్రమ ఆస్తుల గుర్తింపు

  • Msme Summit 2026

    AP : ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ – 2026లో కీలక ఒప్పందాలు చేసుకున్న ఏపీ ప్ర‌భుత్వం

  • Online Petrol

    Petrol Price : మ‌రోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు.. ప‌దిరోజుల్లో నాలుగు సార్లు

Latest News

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

  • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

  • T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

  • CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

  • HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd