Flood Victims : వరద బాధితులకు గుడ్ న్యూస్ తెలిపిన సీఎం చంద్రబాబు
ఇళ్లు నీట మునిగిన ప్రతి కుటుంబానికి రూ.3 వేల తక్షణ సాయం అందించాలని అధికారుల్ని ఆదేశించారు
- By Sudheer Published Date - 09:07 PM, Fri - 26 July 24

వరద బాధితులకు (Flood Victims) సీఎం చంద్రబాబు (CM Chandrababu) తీపి కబురు అందించారు. గత 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో పలు గ్రామాల్లో పెద్ద ఎత్తున పలు పంటలు నీటమునగగా..పలు చోట్ల ఇల్లులు నేలమట్టం అయ్యాయి. ఈ క్రమంలో వారంతా ప్రభుత్వం తమకు సాయం చేయాలనీ కోరుతున్నారు. దీంతో చంద్రబాబు ఈరోజు అసెంబ్లీ కీలక ఆదేశాలు జారీ చేసారు. ఇళ్లు నీట మునిగిన ప్రతి కుటుంబానికి రూ.3 వేల తక్షణ సాయం అందించాలని అధికారుల్ని ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరదలకు నష్టపోయిన ప్రజలను, రైతులను తమ ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని స్పష్టం చేశారు. వరదబాధిత ప్రాంతాలకు వెళ్లి అక్కడ బాధితులను పరామర్శించి, నష్టం అంచనాలను పరిశీలించాలని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, హోం శాఖ మంత్రి వంగలపూడి అనితలను ఆదేశించారు.
We’re now on WhatsApp. Click to Join.
తానే స్వయంగా వెళ్లి వరద బాధితులను పరామర్శించాలని అనుకున్నా కానీ నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీకి వెళ్లాల్సి ఉండటంతో కుదరడం లేదని చంద్రబాబు తెలిపారు. ఏఏ పంటలు ఎంతమేర నీట మునిగాయి, ఇన్‌పుట్ సబ్సిడీ ఎంత వరకు ఇవ్వొచ్చు, మళ్లీ రైతులు కోలుకోవాలంటే ఏం చేయాలి, ఏమివ్వాలనేది నాకు ఒకసారి వివరిస్తే ఆ ప్రకారం వాళ్లను ఆదుకునే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. గతంలో హుదుద్, తిత్లీ తుపాన్లు వచ్చినప్పుడు కూడా ప్రజలకు సాయం చేశాం అని గుర్తుచేశారు.
ఇక ఇటీవల కురిసిన వర్షాలు , గోదావరి వరద ఉధృతికి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. ప్రాథమిక అంచనాల మేరకు ఈ వరదల్లో 4,317 ఎకరాల్లో ఆకుమడులు పూర్తీగా దెబ్బతిన్నాయి. 1.06 లక్షల ఎకరాల్లో వరినాట్లు వేశారు. అదంతా కూడా వరద నీటి ముంపునకు గురైంది. 3,160 ఎకరాల్లో మొక్కజొన్న, 960 ఎకరాల్లో పత్తి పంటలకు నష్టం వాటిల్లింది అని అధికారులు అంచనాలు వేస్తున్నారు.
Read Also : Pavala Syamala : నటి పావలా శ్యామలకు మెగా హీరో సాయం