Posani : ఛాతి నొప్పి అని పోసాని డ్రామా : సీఐ వెంకటేశ్వర్లు
ఛాతి నొప్పి అని పోసాని డ్రామా ఆడారని సీఐ తెలిపారు. దీంతో పోసాని ని తిరిగి రాజంపేట సబ్ జైలుకు తరలించినట్టు తెలిపారు.
- By Latha Suma Published Date - 07:30 PM, Sat - 1 March 25

Posani : సినీనటుడు పోసాని కృష్ణమురళి అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్‌జైలులో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే దీనిపై రైల్వే కోడూరు రూరల్ సీఐ వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. పోసాని అడిగిన అన్ని పరీక్షలను చేయించామని.. తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి, కడప రిమ్స్ హాస్పిటల్ డాక్టర్లు ధృవీకరించారని సీఐ వెల్లడించారు. ఛాతి నొప్పి అని పోసాని డ్రామా ఆడారని సీఐ తెలిపారు. దీంతో పోసాని ని తిరిగి రాజంపేట సబ్ జైలుకు తరలించినట్టు తెలిపారు.
Read Also: Manchu Family -TDP : మంచు ఫ్యామిలీకి టీడీపీ మద్దతు – పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి
కాగా, రిమాండ్ కు తరలించే ముందు పోసాని కృష్ణమురళికి పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు చేయించారు. ఆయన మెడికల్ రికార్డును కూడా పరిశీలించారు. ఆయనకు గుండె సంబంధిత సమస్య ఉందని గుర్తించారు. ఆయన ఉపయోగించే మందులన్నీ ఆయనకు అందుబాటులో ఉంచారు. తనను అరెస్టు చేసిన దగ్గర నుంచి ఆయన టెన్షన్ పడుతున్నారు. అరెస్టు చేసేందుకు తన ఇంటికి వచ్చిన సమయంలో పోలీసులతో ఆయన విపరీతంగా ప్రవర్తించారు. మొదటగా తాను రానన్నారు. తర్వాత ఓ గదిలోకి తీసుకెళ్లి బతిమాలారు. తర్వాత ఆయన బనీన్ , నిక్కర్ మీదనే హడావుడి చేశారు.
ఇకపోతే..బుధవారం పోసానిని అరెస్ట్ చేసిన పోలీసులు గురువారం రైల్వేకోడూరు కోర్టులో హాజరుపరిచగా ఆయనకి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. అనంతరం పోసానిని రాజంపేట సబ్ జైలుకు తరలించారు పోలీసులు. మార్చి 12 వరకు రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా పోసాని కృష్ణ మురళి ఉండనున్నారు.
Read Also: Akasha Air : తమ గగన పరిధిని బీహార్ కు విస్తరించిన ఆకాశ ఎయిర్