AP 10th Paper Leak : ఏపీలో టెన్త్ పేపర్ లీక్ ?
ఎస్‌ఎస్‌సీ పరీక్షల ప్రశ్నపత్రం లీకేజీపై విద్యార్థులు, అధికారుల్లో ఆందోళన నెలకొంది.
- Author : CS Rao
Date : 27-04-2022 - 4:20 IST
Published By : Hashtagu Telugu Desk
ఎస్‌ఎస్‌సీ పరీక్షల ప్రశ్నపత్రం లీకేజీపై విద్యార్థులు, అధికారుల్లో ఆందోళన నెలకొంది. చిత్తూరు జిల్లాలోని కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో తెలుగు కాంపోజిట్ ప్రశ్నపత్రం దర్శనమిచ్చినట్లు సమాచారం. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కాగానే వాట్సాప్ గ్రూపుల్లో 9 గంటల 57 నిమిషాల నుంచి ప్రశ్నపత్రం ప్రత్యక్షమైంది. ఈ వార్తతో విద్యాశాఖ అధికారులు అప్రమత్తమై పేపర్ లీకేజీపై వెంటనే జిల్లా కలెక్టర్ హరినారాయణన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో డీఈవో పురుషోత్తం చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.
పరీక్ష ప్రారంభమైన గంటన్నర తర్వాత ప్రశ్నపత్రం ఎవరిదో కావాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో ప్రచారం చేశారని డీఈవో చెబుతున్నారు. పేపర్ లీక్ ఎక్కడ జరిగిందో తమకు తెలియదని చెప్పారు. కాగా, పేపర్ లీక్ వ్యవహారంపై కలెక్టర్ హరినారాయణ స్పందిస్తూ జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, విద్యార్థులు బాగా పరీక్షలు రాస్తున్నారన్నారు. విద్యార్థులు ఆందోళన చెందవద్దని, వదంతులను నమ్మవద్దని సూచించారు.
Update:
♦ఏపీలో టెన్త్ పరీక్షల పేపర్ లీక్ అయ్యిందంటూ ఉదయం నుంచి వదంతులు.
♦పరీక్ష ఉదయం 9.30గంటలకు ప్రారంభమైతే.. పేపర్ 11.35 గంటలకు బయటకు వచ్చినట్లు క్లారిటీ
♦నంద్యాల జిల్లాలో పేపర్ బయటకు వచ్చినట్లు గుర్తించారు.. బాధ్యులపై కఠిన చర్యలు pic.twitter.com/tT26Zh67jB— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) April 27, 2022