MLC Nagababu : తమ్ముడిని సన్మానించిన అన్నయ్య
MLC Nagababu : మార్చి నెలలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి తరఫున పోటీ చేసిన ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు
- By Sudheer Published Date - 11:02 PM, Wed - 2 April 25

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు (Nagababu) ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడి(MLC)గా ప్రమాణ స్వీకారం చేశారు. మార్చి నెలలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి తరఫున పోటీ చేసిన ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం శాసన మండలి చైర్మన్ సమక్షంలో నాగబాబు ప్రమాణం చేసి, తన బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా మెగా బ్రదర్‌కు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా అన్నయ్య చిరంజీవి (CHiranjeevi), తన తమ్ముడికి సోషల్ మీడియా ద్వారా ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
2025 Prophecies: 2025లో బాబా వంగా చెప్పినట్టే అన్నీ.. ఫ్యూచర్‌లోనూ అవన్నీ
ప్రమాణ స్వీకారం అనంతరం నాగబాబు తన అన్న చిరంజీవి, వదిన సురేఖ ఆశీర్వాదం తీసుకున్నారు. చిరంజీవి దంపతులు పూల మాల వేసి నాగబాబును సన్మానించారు. అంతేకాదు ఓ ఖరీదైన పెన్నును చిరు తమ్ముడికి కానుకగా అందించారు. ఈ సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియాలో “తమ్ముడు నాగబాబుకి అభినందనలు, ప్రజా సేవలో విజయాలు సాధించాలి” అంటూ పోస్ట్ పెట్టారు. ఈ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. చిరు భార్య సురేఖ గతంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కూడా ఆయనకు ఖరీదైన పెన్ కానుకగా ఇచ్చారు. ఇప్పుడు నాగబాబు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయగానే, అదే విధంగా చిరు, సురేఖ ఆశీర్వాదం అందించారు.
ఆంధ్ర ప్రదేశ్ విధాన పరిషత్ సభ్యుడి (MLC) గా ప్రమాణస్వీకారం చేసిన తమ్ముడు @NagaBabuOffl కి ఆత్మీయ అభినందనలు, ఆశీస్సులతో – అన్నయ్య, వదిన 💐💐 pic.twitter.com/wZWXz9ACBB
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 2, 2025