Chiranjeevi : జనసేనకు ఓపెన్‌గా చిరంజీవి మద్దతు.. వీళ్లకు సపోర్ట్ చేయండి అంటూ..
జనసేనకు ఓపెన్‌గా మద్దతు ఇచ్చిన చిరంజీవి. అనకాపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న..
- Author : News Desk
Date : 21-04-2024 - 11:32 IST
Published By : Hashtagu Telugu Desk
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలు వదిలేసి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత.. పాలిటిక్స్ పూర్తి దూరం వహిస్తూ వచ్చారు. ఈక్రమంలోనే తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీ పెట్టినా.. ఎటువంటి మద్దతు తెలపకుండా సైలెంట్ గా ఉంటూ వచ్చారు. మొన్నటివరకు కూడా చిరంజీవి ఇదే మౌనం పాటిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు తన మౌనాన్ని పక్కన పెట్టి జనసేనకి ఓపెన్ గా మద్దతు తెలుపుతున్నారు.
ఇటీవల తమ్ముడిని ప్రత్యేకంగా పిలిపించుకొని జనసేన పార్టీ ప్రచారాల ఖర్చుల కోసం 5 కోట్ల రూపాయిలు విరాళంగా ఇవ్వడం గమనార్హం. అంతేకాదు రామ్ చరణ్ ని కూడా జనసేనకు విరాళం ఇవ్వాలంటూ చెప్పడం విశేషం. ఇక రీసెంట్ గా జనసేన ఎమ్మెల్యే మరియు బీజేపీ ఎంపీని గెలిపించాలంటూ డైరెక్ట్ గా కాంపెయిన్ చేస్తున్నారు. ఇటీవల బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చిరంజీవి తన ఇంటిలో కలుసుకున్న విషయం తెలిసిందే. సీఎం రమేష్ తో పాటు జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ కూడా చిరుతో భేటీ అయ్యారు.
అందుకు సంబంధించిన ఫోటోలు బయటకి వచ్చి వైరల్ అయ్యాయి. తాజాగా వీడియోలు కూడా బయటకి వచ్చాయి. ఈ వీడియోలో చిరంజీవి మాట్లాడుతూ.. “ఇన్నాళ్లు పాలిటిక్స్ కి దూరంగా ఉన్న నేను మళ్ళీ పాలిటిక్స్ గురించి మాట్లాడానికి ప్రధాన కారణం.. నా తమ్ముడు పవన్ కళ్యాణ్. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడడం నాకు సంతోషం ఉంది. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి కారణం.. నా మిత్రులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఎంపీ అండ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. వారికీ మీ సపోర్ట్ కావాలి. అనకాపల్లి డెవలప్మెంట్ కి వీరిద్దరూ బలంగా పని చేస్తారు. కాబట్టి వీరిని గెలిపించాలని మిమ్మల్ని కోరుతున్నాను” అంటూ చిరు డైరెక్ట్ కాంపెయిన్ లోకి దిగారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
నా తమ్ముడు పవన్ కళ్యాణ్- చంద్రబాబు-మోదీ కూటమిగా ఏర్పడటం సంతోషం. ఇది చాలా మంచి పరిణామం. ఏపీ అభివృద్ధిలో ముందుకెళ్లాలి, అందుకోసం ప్రజలంతా నడుం బిగించాలి – @KChiruTweets గారు.#HelloAP_VoteForJanaSenaTDPBJP@PawanKalyan @ncbn @narendramodi pic.twitter.com/MyFchWZtYT
— Trend PSPK (@TrendPSPK) April 21, 2024
Also read : Chandrababu: దమ్ముంటే పవన్ తో సంసారం చెయ్ జగన్