CBN – House Arrest Petition : చంద్రబాబు ‘హౌస్ అరెస్ట్’ పిటిషన్ పై విచారణ నేడే.. సర్వత్రా ఉత్కంఠ
CBN - House Arrest Petition : ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల (ఈ నెల 22 వరకు) జ్యుడీషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.
- Author : Pasha
Date : 11-09-2023 - 7:26 IST
Published By : Hashtagu Telugu Desk
CBN – House Arrest Petition : ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల (ఈ నెల 22 వరకు) జ్యుడీషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఇక చంద్రబాబును తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీఐడీ అధికారులు వేసిన కస్టడీ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగే అవకాశముంది. ఇక చంద్రబాబు రిమాండ్ ను గృహ నిర్బంధంలోకి మార్చాలని కోరుతూ ఆయన తరఫు లాయర్లు వేసిన పిటిషన్ ను కూడా ఏసీబీ కోర్టు ఈరోజు విచారించనుంది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి, వయసు, హోదాను దృష్టిలో పెట్టుకొని హౌస్ అరెస్ట్ కు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ఏసీబీ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే ఆదివారం రోజు జరిగిన వాదనల్లో.. హౌస్ అరెస్ట్ పిటిషన్ ను సీఐడీ తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. ఈ అంశంపై ఆదివారం రోజు ఇరుపక్షాల వాదోపవాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమ బిందు.. దానిపై విచారణను సోమవారానికి వాయిదా వేశారు.