Chandrababu Sabha Stampede: చంద్రబాబు సభలో అపశృతి..7గురు మృతి!
Andhra Pradesh నెల్లూరు జిల్లా కందుకూరులో తెలుగు దేశం పార్టీ నిర్వహించిన 'ఇదేంకర్మ రాష్ట్రానికి' కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది.
- Author : Balu J
Date : 28-12-2022 - 9:49 IST
Published By : Hashtagu Telugu Desk
Andhra Pradesh నెల్లూరు జిల్లా కందుకూరులో తెలుగు దేశం పార్టీ నిర్వహించిన ‘ఇదేంకర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. రోడ్ షోలో చంద్ర బాబు మాట్లాడుతుండగా తొక్కిసలాట జరిగి 7గురు వ్యక్తులు మరణించగా మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది కందుకూరిలోని ఎన్టీఆర్ సర్కిల్ లో ఈ రోజు సాయంత్రం తెలుగుదేశం పార్టీ బహిరంగసభ నిర్వహించింది.
సభా స్థలం పక్కనే పైన ఎటువంటి స్లాబ్ లేని అతి పెద్ద డ్రైనేజీ కాలువ ఉంది. బహిరంగ సభ జరిగిన స్థలం చిన్నగా ఉండటం ప్రజలు ఎక్కువమంది రావడంతో ఒకరినొకరు తోసుకోవడంతో దాదాపు 15 మంది డ్రైనేజీ కాలువలో పడి పోయారు. ఆ 15 మందిలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, ఆస్పత్రిలో మరో ఐదుగు మరణించినట్టు తెలుస్తోంది. మరో నలుగురు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు.
ప్రాంతం ఏదైనా ఆగని పసుపు ప్రభంజనం. నెల్లూరు జిల్లా కందుకూరు లో చంద్రబాబు నాయుడు గారి రోడ్ షో కు హాజరైన అశేష ప్రజానీకం లో ఒక భాగం.#CBNinNellore #IdhemKarmaManaRashtraniki #NCBN #TDPforDevelopment pic.twitter.com/suZeViss3C
— Telugu Desam Party (@JaiTDP) December 28, 2022
మిగతా వారికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే సభను అర్దాంతరంగా ఆపేసిన చంద్రబాబు ఆస్పత్రికి వెళ్ళారు. టీడీపీ కార్యకర్తలు డ్రైనేజీలో పడిపోయినవారందరినీ ఆస్పత్రికి తరలించారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మిగతావారికి కూడా తీవ్రగాయాలవడంతో వారందరికీ వైద్యులు చికిత్స చేస్తున్నారు.
ఎక్స్ గ్రేషియా:
Chandrababu Naidu: అమాయకులు చనిపోవడం బాధ కలిగిస్తోంది.. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం.బాధితుల పిల్లలను ఎన్టీఆర్ ట్రస్టు విద్యా సంస్థల్లో చదివిస్తాం
అమాయకులు చనిపోవడం బాధ కలిగిస్తోంది.. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం.బాధితుల పిల్లలను ఎన్టీఆర్ ట్రస్టు విద్యా సంస్థల్లో చదివిస్తాం – @ncbn . pic.twitter.com/3AWDiisgPT
— iTDP Official (@iTDP_Official) December 28, 2022