Nara Ramamurthy Naidu : సోదరుడి పెద్ద కర్మ సందర్భంగా నారావారిపల్లికి చేరుకున్న చంద్రబాబు
Nara Ramamurthy Naidu : చంద్రబాబు (Chandrababu) తో పాటు ఆయన కుటుంబ సభ్యులు బుధువారం హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో తిరుపతికి చేరుకొని అక్కడి నుండి నారావారిపల్లికి చేరుకున్నారు
- Author : Sudheer
Date : 28-11-2024 - 12:03 IST
Published By : Hashtagu Telugu Desk
చంద్రబాబు సోదరుడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు (Nara Ramamurthy Naidu) ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో (గురువారం) ఆయన పెద్దకర్మను(Nara Ramamurthy naidu peddakarma) నారావారిపల్లిలో జరపనున్నారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు (Chandrababu) తో పాటు ఆయన కుటుంబ సభ్యులు బుధువారం హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో తిరుపతికి చేరుకొని అక్కడి నుండి నారావారిపల్లికి చేరుకున్నారు.
హైదరాబాద్‌లో నివాసం ఉండే నారా రామమూర్తి నాయుడు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ ఈనెల 16వ తేదీన మృతి చెందారు. సోదరుడి మృతితో చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆ సమయంలో మహారాష్ట్ర పర్యటనలో ఉన్న బాబు..సోదరుడి మరణ వార్త విని హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకుని మృతదేహాన్ని స్వగ్రామం నారావారిపల్లికి తరలించి దగ్గరుండి అంత్యక్రియలు జరిపించారు. రామ్మూర్తి నాయుడు పెద్ద కుమారుడు, సినీ హీరో నారా రోహిత్ తండ్రి పార్థివదేహానికి తలకొరివిపెట్టి అంత్యక్రియలు నిర్వహించారు. తల్లిదండ్రుల అంతిమ సంస్కారాలు నిర్వహించిన చోటే రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు జరిగాయి.
Read Also : Minister Sridhar Babu: తెలంగాణతో ద్వైపాక్షిక సంబంధాలకు బల్గేరియా ఆసక్తి: మంత్రి శ్రీధర్ బాబు