HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu Next Cm In Ap

Telangana TDP: త్వరలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం: రావుల

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు త్వరలో ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు తెలంగాణ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి.

  • Author : Vamsi Chowdary Korata Date : 06-06-2023 - 6:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CBN Prediction
Chandrababu

Telangana TDP: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు త్వరలో ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు తెలంగాణ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి. ఈ రోజు చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ని సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ చంద్రబాబుకు ఘనంగా స్వాగతం పలికారు. తెలుగు తమ్ముళ్లు బాణాసంచా పేల్చుతూ చంద్రబాబుకు ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

రావుల చంద్రశేఖర్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు భారీ మెజారిటీతో విజయం సాధించి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు రెండవ సారి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఆయనకు విశేష్ తెలియజేశారు రావుల. ఏపీలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచేది టీడీపీనే అని అభిప్రాయపడ్డారు. తూర్పున సూర్యుడు ఉదయిస్తాడనేది ఎంత సత్యమే.. వచ్చే ఎన్నికల్లో ఏపీకి చంద్రబాబు సీఎం కావటం కూడా అంతే సత్యమని అన్నారు. చంద్రబాబు 20 ఏళ్లకు పైగా ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ చరిత్ర సృష్టించారని ప్రశంసించారు. చంద్రబాబు 1995 సెప్టెంబర్ 1నుంచి టీడీపీకి చంద్రబాబుకు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు, 14 ఏళ్ళు సీఎంగా, మరో 14 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా కొనసాగారని రావుల తెలిపారు.

తెలంగాణాలో టీడీపీ పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు తెలంగాణ టీడీపీ నేతలు కృషి చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బస్సు యాత్ర ప్రారంభించనున్నట్టు ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రభావం కొంతైనా ఉండేలా వ్యూహాలు రచిస్తున్నారు.

Read More: TS Government: తెలంగాణ ప్రజలకు శుభవార్త.. ప్రభుత్వం లక్ష సహాయం.. ఇలా అప్లై చేసుకోండి?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap politics
  • chandrababu
  • kasani gnaneshwar
  • Ravula Chandra Sekar Reddy
  • TDP cheif
  • Tealngana Politics
  • telangana tdp

Related News

    Latest News

    • Importance of Marriage: పెళ్లికి ఆ మూడు రుణాలతో సంబంధం తెలుసా?

    • PM Modi: జవహర్‌లాల్ నెహ్రూ రికార్డు బ్రేక్ చేయబోతున్న ప్రధాని మోడీ.

    • DK Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప‍్రమాణం

    • CM Chandrababu: తెలంగాణలో పవన్ సభపై స్పందించిన చంద్రబాబు

    • Khushboo: సీఎం విజయ్‌ని కలిసి కూతురి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చిన ఖుష్బూ దంపతులు

    Trending News

      • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd