CBN Gift : బాలకృష్ణ కు చంద్రబాబు మరో గిఫ్ట్
CBN Gift : గతంలో ఈ ఆస్పత్రికి అమరావతిలో బ్రాంచ్ స్థాపన కోసం 15 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం, తాజాగా జరిగిన సీఆర్డీఏ సమావేశంలో మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం అదనంగా 6 ఎకరాలను మంజూరు చేసింది.
- Author : Sudheer
Date : 06-05-2025 - 9:17 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) అమరావతి (Amaravati) రాజధాని అభివృద్ధిపై పూర్తి స్థాయి దృష్టి సారించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Modi) తాజాగా అమరావతిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో, సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం భూముల కేటాయింపులను వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే జరిగిన సీఆర్డీఏ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే మరియు ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ(Balakrishna)కు చెందిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి(Basavatarakam Indo American Cancer Hospital)కి మరో కీలక గిఫ్ట్ లభించింది.
Faria Abdullah : పవన్ కళ్యాణ్‌తో డేటింగ్ కు రెడీ అంటున్న యంగ్ హీరోయిన్
గతంలో ఈ ఆస్పత్రికి అమరావతిలో బ్రాంచ్ స్థాపన కోసం 15 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం, తాజాగా జరిగిన సీఆర్డీఏ సమావేశంలో మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం అదనంగా 6 ఎకరాలను మంజూరు చేసింది. దీంతో మొత్తం 21 ఎకరాలు ఈ సంస్థకు కేటాయించబడ్డాయి. ఆస్పత్రి చైర్మన్‌గా ఉన్న బాలకృష్ణ ఇప్పటికే సీఆర్డీఏ అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించగా, అక్కడ ఉన్న హెచ్‌టీ విద్యుత్తు లైన్ల తొలగింపునకు చర్యలు తీసుకోవడం మొదలయ్యాయి.
ప్రారంభ దశలో 300 పడకలతో నిర్మించబోయే బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిని భవిష్యత్తులో 1,000 పడకల సామర్థ్యానికి విస్తరించనున్నారు. ఇదే స్థలంలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయబోతున్నారు. ఈ ప్రాజెక్టులు అమలవడం వల్ల రాష్ట్రానికి మెరుగైన ఆరోగ్య సేవలు లభించడంతో పాటు, విద్యా రంగంలో కూడ ఉపయోగపడనున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అందించిన ఈ గిఫ్ట్‌తో బాలకృష్ణ కుటుంబసభ్యులు, టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.