Rajdhani Files : రాష్ట్ర ప్రజలంతా “రాజధాని ఫైల్స్” చూడండి – చంద్రబాబు పిలుపు
- By Sudheer Published Date - 11:36 PM, Fri - 16 February 24

ఏపీ రాష్ట్ర రాజకీయాలు (AP Politics) అంత సినిమాల చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తుండడం తో వరుస పెట్టి అధికార , ప్రతిపక్ష పార్టీలకు అనుగుణంగా సినిమాలు వస్తున్నాయి. ఇప్పటీకే జగన్ కు సపోర్ట్ గా యాత్ర 2 (Yatra 2)మూవీ రాగా..ఇక ఈరోజు టీడీపీ(TDP) అనుకూలంగా “రాజధాని ఫైల్స్” మూవీ వచ్చింది. గత ఐదు సంవత్సరాలుగా రాజధాని కోసం రాష్ట్ర ప్రజలు ఎంతగా ఎదురుచూస్తున్నారో ఈ మూవీ లో చూపించారు. అమరావతి కోసం 1500 రోజుల పైగా అలుపెరుగని పోరాటాన్ని చేస్తున్న ఉద్యమ నేపథ్యాన్ని, కేవలం 150 నిముషాల వ్యవధిలో అది కూడ సహజ సిద్ధంగా చిత్రీకరించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇప్పటికే ఈ సినిమా ఫై టీడీపీ నేతలు స్పందించారు. సందేశాత్మకంగా ఉండే ఒక అర్థవంతమైన ముగింపు ఈ చిత్రానికి హైలైట్ అని , రాష్ట్ర ప్రజలంతా ఈ సినిమాని చూడాలని.. అలాగే చూసేలా మరో పది మందిని ప్రోత్సహించాలని అచ్చెన్నాయుడు ఇప్పటికే పిలుపునివ్వగా…తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఈ సినిమాను చూడాలని పిలుపునిచ్చారు. అమరావతిపై విడుదలైన రాజాధాని ఫైల్స్ పై ఆయన స్పందిస్తూ, ఇది ఒక విషాదమని ‘ఎక్స్'(ట్విటర్)లో ఆయన పేర్కొన్నారు. అధికార బలాన్ని ఉపయోగించి ఉద్యమకారులను చిత్రహింసలకు గురిచేశారని దుయ్యబట్టారు. ఈ కుట్రలు, దారుణాలకు అద్దం పట్టిన చిత్రం ‘రాజధాని ఫైల్స్’ అని పేర్కొన్నారు.
జగన్ క్రూరత్వానికి, వైసీపీ విధ్వంసానికి నాశనమైన రాజధాని.. దాని కోసం ఎన్నో త్యాగాలు చేసిన ప్రజల కష్టాలను ఇందులో చూపించారని తెలిపారు. అందుకే ఈ చిత్రం విడుదలను ఆపడానికి జగన్ శతవిధాలా ప్రయత్నించారని విమర్శించారు. కానీ న్యాయస్థానంలో ఆ ఆటలు సాగలేదన్నారు. తెలుగు ప్రజలంతా థియేటర్లకు వెళ్లి ‘రాజధాని ఫైల్స్’ సినిమా చూసి వాస్తవాలను తెలుసుకోవాలని పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఒక ప్రాంతం పై కక్షగట్టి… అది కూడా రాష్ట్ర రాజధాని పై పగబట్టి సర్వనాశనం చేసిన ప్రాంతం అమరావతి. ఇది ఒక చారిత్రాత్మక విషాదం. దీని కోసం కులాల కుంపట్లు రాజేసాడు. విష ప్రచారాలు చేయించాడు. అధికార బలం మొత్తాన్ని ఉపయోగించి ఉద్యమకారులను చిత్రహింసలకు… pic.twitter.com/ZpAESYy3a1
— N Chandrababu Naidu (@ncbn) February 16, 2024
Read Also : India: ఇండియా కూటమికి మరో బిగ్ షాక్, మరో పార్టీ ఔట్