TDP Mahanadu : ఉన్మాది పాలనలో ఏపీ సర్వనాశనం: చంద్రబాబు
ఏపీలోని ఉన్మాది పాలన సాగుతోందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మహానాడు ప్రారంభోత్సవంలో ఆందోళన చెందారు.
- By CS Rao Published Date - 12:52 PM, Fri - 27 May 22

ఏపీలోని ఉన్మాది పాలన సాగుతోందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మహానాడు ప్రారంభోత్సవంలో ఆందోళన చెందారు. పోలీసులను అడ్డం పెట్టుకుని అరాచక పాలనను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, కబ్జాలు, దోపిడీలు పెరిగిపోయాయని దుయ్యబట్టారు. చేతకాని దద్దమ్మ పాలన వల్ల ఏపీ పరువు మొత్తం పోయిందని విమర్శించారు. ఒంగోలులో ప్రారంభమైన తొలి రోజు ప్రసంగంలో క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు.
మహానాడు అంటే గుర్తొచ్చేది ఎన్టీఆర్ అని, ఇది తెలుగువారి పండుగ అని అన్నారు. తెలుగుదేశం వెనుకబడిన తరగతుల పార్టీ అని చెప్పారు. వైసీపీ అరాచక పాలనకు వ్యతిరేకంగా మాట్లాడిన టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి, అరెస్ట్ చేశారని… టీడీపీ కార్యకర్తలు అరెస్ట్ అయినప్పుడల్లా తాను నిద్రలేని రాత్రులను గడిపానని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పన్నులు, ధరలతో బాదేస్తున్నారని చెప్పారు. ఇసుక, సిమెంట్ ధరలను పెంచేశారని అన్నారు. సిమెంట్ ధరలు పెరగడంతో నిర్మాణరంగం దెబ్బతిన్నదని చెప్పారు. రాష్ట్రంలో నిత్యావసరాలు కొనలేని పరిస్థితి ఉందని అన్నారు.
ఏపీలో మహిళలపై దాడులు పెరిగిపోయాయని చంద్రబాబు అన్నారు. వైసీపీ నేతలు కరుడుగట్టిన నేరస్తులని అన్నారు. నిలదీస్తే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. కేసులకు, లాఠీలకు భయపడమని చెప్పారు. జగన్ పాలనలో సంక్షేమం అనేది ఒక బూటకమని చెప్పారు. అమ్మ ఒడి అన్నారు.. నాన్న బుడ్డీ పెట్టారని ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని అన్నారు. పెట్రోల్ ధరలను కేంద్రం తగ్గించినా.. రాష్ట్రం తగ్గించడం లేదని విమర్శించారు. ఆయన ప్రసంగంలోని ప్రధాన అంశాలివి.
*పసుపు శుభానికి చిహ్నం. స్వర్గీయ ఎన్టీఆర్ ఎంతో ముందుచూపుతో తయారు చేసిన జెండాను చూడాలి.
*జగన్ రెడ్డితో కాదు, ప్రజలకు ఇబ్బందులున్నాయి. ప్రస్టేషన్ లో ప్రజలు ఉన్నారు. ప్రజలకు భరోసా ఇవ్వడంలో టీడీపీ విజయం సాధించింది. జైలుకు వెళితే బయటకు తీసుకొస్తామని నమ్మకం కల్పించాం
*పోలీసుల్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలను, పోరాటం చేసే వాళ్లను నియంత్రణ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. పోలీసుల తీరు మారాలి. అసాంఘిక శక్తుల్ని ఏపీ పోలీసులు ఒకప్పుడు అణచారు. ఇప్పుడు ప్రతిపక్షాలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. లాఠీలకు, తుపాకులకు భయపడే తత్త్వం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు
*ఉన్మాది చేతిలో పోలీసులు బలి కావొద్దని సూచిస్తున్నాం. తప్పుచేసే పోలీసులు జైలుకు పంపిస్తాం. గతంలో జైలుకు పోయిన పోలీసుల చరిత్ర తెలుసుకోండి. పోలీసుల తీరు మారకపోతే మూల్యం చెల్లించుకుంటారు.
*చరిత్ర హీనులుగా వైసీపీ నాయకుల్ని నిరూపిస్తాం. తప్పులను ఒప్పుకునే రకం జగన్ కాదు.
*కేంద్రం తగ్గించినప్పటికీ పెట్రోలు, డీజిల్ , గ్యాస్ ధరలు పెంచిన జగన్. విద్యుత్ కోతలు, నిత్యావసరాలు ధరల పెరుగుదల, మరుగుదొడ్లు, డ్రైనేజి టాక్స్ ఇలా పెంచుకుంటూ పోతున్నారు. జగన్ కారణంగా ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. రైతులు ఎవరూ ఆనందంగా లేరు.
*రైతుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వంపై పోరాడేందుకు రోడ్లపైకి రావాలి. ఆత్మహత్యలు చేసుకోకుండా జగన్ ప్రభుత్వంపై పోరాటం చేయడానికి ముందుకు రావాలి. కనీస మద్ధతు ధరలు ఇవ్వడంలేదు. 13500 రైతుల భరోసా ఇస్తామని చెప్పి మోసం చేశారు. ధాన్యం కొనుగో్లు చేయడంలో వైఫల్యం చెందారు. రైతే రాజుగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి. మోటార్లకు మీటర్లు పెట్టడం ద్వారా రైతుల మెడకు విద్యుత్ భారాన్ని వేసే ప్రయత్నం చేస్తున్నారు. మోటార్లకు మీటర్లు పెట్టకుండా అడ్డుకోవాలి.
*అమ్మ ఒడి కంటే నాన్న బుడ్డి ద్వారా కలెక్షన్ చేస్తున్నారు. సంక్షేమ పథకాలను ఎక్కువగా ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం. ఇప్పుడు కేవలం టీడీపీ సర్కార్ ఇచ్చిన సంక్షేమం లో 41శాతం మాత్రమే ఇస్తున్నారు. పెళ్లి కానుక, విదేశీ విద్యా పథకం, చంద్ర బీమా, రంజాన్ తోఫా, సంక్రాంతి కానుక , అన్న క్యాంటర్లు ఎక్కడ ఉన్నాయి. పథకాలన్నింటీనీ రద్దు చేసిన జగన్ సర్కార్ సంక్షేమ పథకాలకు కోత పెట్టారు.
* వెనుకబడిన వర్గాలకు పలు రకాలుగా తెలుగుదేశం పార్టీ అండగా ఉంది. బడుగు బలహీన వర్గాలు టీడీపీతోనే ఉన్నాయి. సబ్ ప్లాన్ పెట్టడం ద్వారా బీసీలను ఆదుకున్నాం. ప్రస్తుతం నిధులను జగన్ సర్కార్ మళ్లిస్తోంది. ఆదరణ వంటి పథకాలతో బీసీలను ఆదుకుంటే, వైసీపీ అన్యాయం చేసింది.
* మద్య నిషేధం హామీ ఇచ్చిన జగన్ చేతులెత్తేశారు. ఇళ్ల నిర్మాణం నిలిచిపోయింది. ఇసుక, ఇనుము, కంకర ధరలు పెరిగాయి. భూములను. జగన్ సర్కార్ ఆక్రమిస్తోంది. అసైన్డ్ భూములను లాగేసుకుంటున్నారు.
*8లక్షల కోట్లకు అప్పు చేరినప్పటికీ అభివృద్ధి మాత్రం కనిపించడంలేదు. జగన్ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదు.
*ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్ ఏం చేశాడు. కేంద్రం వద్ద మెడలు వంచి రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నాడు. పోలవరం, విభజన చట్టంలోని అంశాలను పట్టించుకోవడంలేదు.
*మహిళలపై పెరుగుతోన్న దాడులను జగన్ ఆపలేకపోతున్నాడు. బయట తిరగలేని పరిస్థితుల్లో మహిళలు ఉన్నారు. డ్రగ్స్, గంజాయి ఏపీలో విచ్చలవిడిగా ఉంది. ఇవన్నీ ప్రశ్నిస్తే టీడీపీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. సంఘవిద్రోహశక్తుల్ని మాత్రం అదుపు. చేయలేని పరిస్థితిల్లో జగన్ ఉన్నాడు.
*తెలుగుదేశం పార్టీ ముందుచూపుతో పనిచేస్తుంది. అందుకే, హైదరాబాద్ లో ఐఎస్ బీ, జీనోమ్ వాలీ, ఐటీ ఇండస్ట్రీస్ ను ప్రమోట్ చేశాం. ఆనాడు ప్రధాని వాజ్ పేయ్ ఐఎస్ బీ ప్రారంభించారు. ప్రస్తుతం స్నాతకోత్సవానికి మోడీ వచ్చారు. కానీ, తన పేరు ప్రస్తావించనప్పటికీ జాతికి సేవ చేశానన్న తృప్తి ఉంది.
*విభజన తరువాత అందరూ బాధపడ్డారు. హైదరాబాద్ ఫలితాలను తెలంగాణ అనుభవిస్తుంది. అలాగే ఏపీని అభివృద్ధి చేయాలని 2029 విజన్ రూపొందించాను. కానీ, జగన్ వచ్చిన తరువాత అన్నింటినీ నాశనం చేశాడు. విభజన చట్టంలోని పోలవరం పనులను 72శాతం పూర్తి చేశాను. రివర్స్ టెండర్ పేరుతో డయాఫ్రం వాల్ కొట్టుకుపోయేలా జగన్ అసమర్థ సర్కార్ ఉంది.
*నేషనల్ హై కోసం ఆనాడు వాజ్ పేయ్ తో మాట్లాడి చేశాం. టెలికాం, నేషనల్ హైవే లపై మలేషియా తరహాలో ఆనాడు వాజయ్ పేయ్ తో కలిసి ప్లాన్ చేశాం. గ్రామాల్లో 22 కి.మీ రోడ్లను టీడీపీ వేసింది. అదే జగన్ 2 కి.మీ వేశాడు. ఒక తట్ట మట్టి కూడా జగన్ సర్కార్ వేయలేదు. ఇలాంటి సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్ట్ లు చేస్తారా?
*రాష్ట్రం సర్వనాశనం అయింది. అందరూ కష్టాల్లో ఉన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అందరిపై ఉంది. అందుకోసం దిశ దశను నిర్దేశించే వేదిక మహానాడు.
*ఎన్నికలకు ముందు బాబాయ్ గుండె పోటు అన్నాడు. అదే మనం నమ్మాలా? గొడ్డలి పోటును గుండె పోటుగా మార్చిన దుర్మార్గుడు జగన్. కోడి కత్తి డ్రామా ఆడాడు. సానుభూతి ఓట్ల కోసం డ్రామాలు వేశాడు. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ మోసం చేశాడు. కరెంట్ తీగ పట్టుకుంటే ఒక్క ఛాన్స్ అంటూ
*నడిరోడ్డులో వైసీపీని నిలబెట్టే బాధ్యత ప్రజలపై ఉంది. తూర్పు గోదావరి జిల్లాలో సుబ్రమణ్యం హత్యను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. వైసీపీ నాయకులను కాపాడాలని పోలీసులు ప్రయత్నిస్తే, పోలీసులకు శాపంగా మారతాయి. ప్రజా వ్యతిరేకత, దళితుల్లో చైతన్యం రావడంతో కోనసీమలో కుల చిచ్చుపెట్టే ప్రయత్నం జగన్ చేస్తున్నాడు.
*అంబేద్కర్ పై అభిమానం ఉంటే అమరావతిలో 125 అడుగుల విగ్రహం ప్రాజెక్టును అభివృద్ధి చేయాలి. మంత్రి ఇళ్లు కోనసీమలో తగులపెడితే పోలీసులు దాన్ని ఆర్పలేరా?
*బాదుడే బాదుడుకి పోటీగా గడపగడపకు వైసీపీ పెట్టారు. ప్రజల రాకపోవడంతో గడపగడపకు మన. ప్రభుత్వం అంటూ పేరు మార్చారు. కానీ, ప్రజలు ముందుకు రాకపోవడంతో జనాన్ని తీసుకొచ్చే బాధ్యతను పోలీసులకు అప్పగించారు. కానీ, ప్రజలు సహాయనిరాకరణ చేయడంతో జగన్ కు మతి పోయింది.
* రాజ్యసభ సీట్లను రాయలసీమ, ఉత్తరాంధ్రకు ఇవ్వలేదు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు రాజ్యసభ సీట్లను ఇచ్చారు. సొంత కేసుల్లో ఏ2లకు , కేసులను వాదించే లాయర్ కు రాజ్యసభ ఇచ్చారు. తప్పులను సరిచేసుకోవాలని జగన్ కు సూచన. తప్పు మీద తప్పు చేసి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. అందుకే క్విట్ జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదం అవసరం.
*ప్రజల ఆదాయం ఏపీలో తగ్గింది. జగన్ సొంత ఆస్తులు పెరిగాయి. ఉద్యోగాలు ఎవరికీ రావడంలేదు. జగన్ కుటుంబీకులు, స్నేహితులకు ఆస్తులు పెరిగాయి.
*మీడియా, పోలీసులు, ఉద్యోగులు ఆలోచించుకోవాలి. జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో జగన్ సర్కార్ ఉంది. మీడియా వాళ్లపై కేసులు పెడుతున్నారు. ఇవన్నీ అందరూ ఆలోచించాలి.
*దావోస్ లో జగన్ చేసిన ఎంవోయూలు చూస్తే మోసగారితనం బయటపడుతుంది. గ్రీన్ కో ఒప్పందంపై జగన్ కేసులు
వేసి ఇప్పుడు ఎంవోయూలు చేసుకుంటున్నారు. ఆదానీతో లాలూచీ పడ్డ జగన్ ఇప్పుడు దావోస్ కు వెళ్లి ఆయనతో ఎంవోయూలు జగన్ చేసుకున్నాడు. ఆనాడు తెలుగుదేశం పార్టీ చేసిన ఒప్పందాలను మళ్లీ చేసుకుంటున్నాడు.
*తెలుగుదేశం పార్టీ రాబోవు 40ఏళ్లకు సరిపడా ప్లాన్ తో వెళ్లాలి. 40శాతం యువతకు అవకాశం ఇస్తాం. నూతన ఉత్సాహంతో పార్టీని నింపుతాం.
* ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా కార్యకర్తలకు బీమాను కల్పించాం. నీరు చెట్టు, నరేగా ప్రోగ్రామ్ కింద పనులు చేసిన కార్యకర్తలకు చివరి రూపాయి వచ్చే వరకు పోరాడతాం. ఆర్థికంగా క్యాడర్ ను ముందుకు తీసుకెళ్లడానికి న్యూట్రిఫుల్ ప్రోగ్రామ్ ను తయారు చేస్తున్నాం. ఉచితంగా కార్యకర్తలకు ఆస్పత్రుల్లో చికిత్స చేసే ప్రయత్నం చేస్తాం. కుటుంబ సభ్యుల మాదిరిగా కార్యకర్తలను ఆదుకుంటాను.
* మెంబర్ షిప్ టెక్నాలజీ యుగంలో దూసుకెళ్లింది. పార్టీకి చేసిన సేవ ఆధునీకరణ అవుతుంది. క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకుని గుర్తిస్తాం. పార్టీ కోసం ఖర్చు పెట్టడం కూడా సేవ కింద చూస్తాను. పలు రకాల సమర్థతలు ఉన్న కార్యకర్తలు ఉన్నారు. వాళ్లందరినీ ఉపయోగించుకునేలా ప్లాన్ చేస్తున్నాం. 60లక్షలు ఉండే కుటుంబం తెలుగుదేశం పార్టీ.
*ప్రజలకు అండగా ఉంటూ ఓటర్స్ మేనేజ్మెంట్ నుంచి ప్రతిదీ చేయాలి. క్యాడర్ కు అండగా నేను ఉంటాను. పనిచేసే వాళ్లకు నేరుగా న్యాయం చేసే వ్యవస్థ తెలుగుదేశంకు ఉంది. ఒక. పక్క రాష్ట్రాన్ని కాపాడుకుంటూ ఇంకో వైపు పార్టీని కాపాడాలి. చైతన్య రథం పేరుతో ఈ పేపర్ పార్టీకి ఉంది. దాన్ని కార్యకర్తలు చదువుకోవాలి.
*స్వాతంత్ర్య పోరాటం తరహాలో భవిష్యత్ తరాల కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి.