HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu Naidu Plans Night Halt At Nimmakuru In Laws Place

Chandrababu : అత్తారింటికి చంద్ర‌బాబు!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడు అత్తారింటికి వెళ్ల‌బోతున్నారు. ఈనెల 29వ తేదీన అక్క‌డే బ‌స చేయ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

  • Author : CS Rao Date : 24-06-2022 - 7:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandrababu Nimmakuru
Chandrababu Nimmakuru

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడు అత్తారింటికి వెళ్ల‌బోతున్నారు. ఈనెల 29వ తేదీన అక్క‌డే బ‌స చేయ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ స్వ‌గ్రామం నిమ్మ‌కూరు ఆయ‌న కోసం ముస్తాబవుతోంది. ఇంత‌కీ ఎందు కోసం? ఆయ‌న పెళ్లి చేసుకుని కొన్ని ద‌శాబ్దాలు గ‌డిచిన త‌రువాత ఇప్పుడు అత్తారింటికి ఏంటి? అనుకుంటున్నారా? అప్పుడేమో కొత్త‌ల్లుడిగా వెళ్లి ఉంటారు. ఇప్పుడేమో రాజ‌కీయ వ్యూహాలు ప‌న్న‌డానికి నిమ్మ‌కూరు వెళుతున్నారు.

గుడివాడ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో నిమ్మ‌కూరు ఉంది. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి తెలుగుదేశం పార్టీ కంచుకోట‌గా ఆ నియోజ‌క‌వ‌ర్గం ఉండేది. కానీ, 2014, 2019 ఎన్నిక‌ల్లో కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు అలియాస్ నాని వైసీపీ త‌ర‌పున గెలుపొందారు. అంత‌కంటే ముందు 2009, 2004 ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్యర్థిగా గెలిచిన నాని పార్టీ మార‌డంతో తెలుగుదేశం పార్టీ వెనుక‌బ‌డింది. అక్క‌డ టీడీపీ ఓట‌ర్లు ఎక్కువ‌గా ఉంటారు. అంతేకాదు, నంద‌మూరి ఫ్యామిలీ ప్ర‌భావం కూడా ఎక్కువ‌గా ఉంటుంది. అందుకే, 1983 నుంచి టీడీపీ గెలుస్తూ వ‌చ్చింది. తొలుత ఎన్టీఆర్ అక్క‌డి నుంచే పోటీ చేసి గెలుపొందారు. అదే ఆన‌వాయితీ కొన‌సాగుతూ వ‌చ్చింది. దాన్ని బ్రేక్ చేసిన లీడ‌ర్ కొడాలి నాని. ఆయ‌న్ను టార్గెట్ చేయ‌డం ఇప్పుడు చంద్ర‌బాబు ముందున్న ఛాలెంజ్‌.

ఇటీవ‌ల మాజీ మంత్రి కొడాలి నాని ప‌లు సంద‌ర్భాల్లో నారా కుటుంబాన్ని రాజ‌కీయంగా టార్గెట్ చేస్తూ ర‌చ్చ చేశారు. వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు కూడా దిగారు. రాజ‌కీయ జీవితాన్ని ఉద‌హ‌రిస్తూ ప‌లుమార్లు చంద్ర‌బాబును వ్య‌క్తిగ‌తంగా దుర్భాష‌లాడారు. ద‌మ్ముంటే గుడివాడ‌లో ఓడించాల‌ని స‌వాల్ విసిరారు. తండ్రీకొడుకులు ఇద్ద‌రూ వ‌చ్చినా చిటికెన వేలు మీద వెంట్రుక కూడా పీక‌లేర‌ని కొడాలి రెచ్చ‌గొట్టారు. ఆనాటి నుంచి చంద్ర‌బాబు సమ‌యం కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి కొడాలి, వ‌ల్ల‌భ‌నేని వంశీల‌ను ఎలాగైన చిత్తుగా ఓడించాల‌ని టీడీపీ కృష్ణా జిల్లా విభాగం వ్యూహాల‌ను ర‌చిస్తోంది. దానికి చంద్ర‌బాబు ప‌దును పెడుతున్నారు. ఇప్ప‌టికే వంగ‌వీటి రాధ ఒక‌టి రెండు సంద‌ర్భాల్లో గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. బ‌హుశా చంద్ర‌బాబుకు తెలియ‌కుండా ఆయ‌న వెళ్లి ఉండ‌రు. ఆయ‌న్ను అస్త్రంగా ఉప‌యోగించ‌డం ద్వారా కొడాలిని దెబ్బ‌తీయాల‌ని బాబు ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది.

ఏపీ వ్యాప్తంగా ప్ర‌తి వారం కొత్త జిల్లాల వారీగా ప‌ర్య‌టిస్తోన్న చంద్ర‌బాబు ఈసారి కృష్ణా జిల్లా ప‌ర్య‌ట‌న పెట్టుకున్నారు. ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ ప్రాంతాల్లో నిర్వ‌హించిన మినీ మ‌హానాడులు అనూహ్యంగా విజ‌య‌వంతం అయ్యాయి. ఒంగోలు మ‌హానాడు సూప‌ర్ హిట్ త‌రువాత క్యాడ‌ర్ లోనూ నూత‌నోత్సాహం క‌నిపిస్తోంది. అదే ఉత్సాహాన్ని కొన‌సాగిస్తూ మినీ మ‌హానాడుల‌కు జిల్లాల వారీగా బాబు వెళుతున్నారు. తొలి రోజు భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించ‌డం, రెండో రోజు జిల్లాలోని నియోజ‌క‌వ‌ర్గాల నేత‌ల‌తో స‌మీక్ష , మూడో రోజు రోడ్ షోలు పెడుతున్నారు. ఇదే పంథాలో కృష్ణా జిల్లాకు వెళ్ల‌నున్న ఆయ‌న కొడాలి మ‌రోసారి నోరెత్త‌కుండా ఉండేలా కార్య‌క్ర‌మాల‌ను విజ‌య‌వంతం చేయ‌డానికి రూట్ మ్యాప్ త‌యారు అయింది. కృష్ణా జిల్లా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా రోడ్ షో ముగిసిన త‌రువాత చంద్ర‌బాబు అత్త‌గారింట బ‌స చేయ‌నున్నార‌ని తెలుస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu naidu
  • harikrishna nandamuri
  • Nimmakur
  • telugu desam party

Related News

Former Andhra Pradesh CM Nadendla Bhaskara Rao Passes Away

Nadendla Bhaskara Rao: నాదెండ్ల భాస్కరరావు రాజకీయ ప్రస్థానం ఇదే!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూశారు. అనారోగ్య కారణాలు, వృద్ధాప్య సమస్యలతో హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో గత నెల రోజులుగా చికిత్స పొందుతున్న నాదెండ్ల కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. నాదెండ్ల భాస్కరరావు కుమారుడు ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్. ఆయన అంత్యక్రియలను పంజాగుట్ట శ్మశానవాటికలో రేపు సాయంత్రం 4 గంటల

  • HBDOneAndOnlyCBN

    HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

  • Jr Ntr Birthday Wishes To C

    Jr NTR: మామయ్యకు జూనియర్ ఎన్టీఆర్ విషెస్

  • PM Modi wishes Andhra Pradesh CM Chandrababu Naidu

    చంద్రబాబుకు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్

  • Chandrababu Naidu

    Women’s Reservation Bill : దేశ చరిత్రలో ఇదొక బ్లాక్ డే అంటూ చంద్రబాబు ఆవేదన

Latest News

  • మీ టూత్ బ్రష్ ఎక్స్‌పైరీ డేట్ తెలుసుకోండిలా?

  • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

  • టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో భారీ మార్పులు!

  • బెంగాల్ ఎన్నికల్లో ‘ఝల్‌మురి’ సెగ.. మోదీ వర్సెస్ దీదీ

  • Akira Nandan : రేణు డైరెక్షన్లో అకిరా ఎంట్రీ ?

Trending News

    • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

    • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

    • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

    • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

    • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd