Rushikonda Palace : రుషికొండ ప్యాలెస్..ముందు వైట్ హౌస్ కూడా పనికిరాదు – చంద్రబాబు
Rushikonda Palace : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తొలిసారిగా విశాఖపట్నం రుషికొండ ప్యాలెస్ సముదాయాన్ని పర్యటించారు
- Author : Sudheer
Date : 02-11-2024 - 5:54 IST
Published By : Hashtagu Telugu Desk
రిషికొండలో 18 ఎకరాల్లో భవనాలు కట్టారని..ఈ ప్యాలెస్ (Rushikonda Palace) ముందు వైట్ హౌస్, రాష్ట్రపతి భవన్ లు కూడా తక్కువే అని..ఆ రేంజ్ లో ఈ ప్యాలెస్ లో సౌకర్యాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తొలిసారిగా విశాఖపట్నం రుషికొండ ప్యాలెస్ సముదాయాన్ని పర్యటించారు. ఈ భవనాలను గత ప్రభుత్వ హయాంలో నిర్మించారు. ఈ రోజు మధ్యాహ్నం చంద్రబాబు అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలో రోడ్ల పునరుద్ధరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ రోడ్డుపై గుంతలు పూడ్చే కార్యక్రమానికి శంకుస్థాపన చేశారు. అనంతరం విశాఖలోని రుషికొండ చేరుకుని, ఆ ప్యాలెస్ సముదాయంలోని వివిధ భవనాలు, వాటిలో ఉన్న సౌకర్యాలను సమీక్షించారు.
ఈ పర్యటనలో చంద్రబాబు వెంట మంత్రి కందుల దుర్గేశ్, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఉన్నారు. గంటా శ్రీనివాసరావు చంద్రబాబుకు రుషికొండ ప్యాలెస్ సముదాయానికి సంబంధించిన వివరాలు తెలియజేశారు. చంద్రబాబు అక్కడి సౌకర్యాలను, విలాసవంతమైన ఏర్పాట్లను పరిశీలించి, అధికారుల్ని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ..రిషికొండలో 18 ఎకరాల్లో భవనాలు కట్టారని , వైట్ హౌస్, రాష్ట్రపతి భవన్లో కూడా ఇలాంటి సౌకర్యాలు ఉండవని వ్యాఖ్యానించారు. ఈ భవనాలను చూసేందుకు ఎవరినీ అనుమతించలేదు. టూరిజం కోసం కడుతున్నట్లు అందరినీ నమ్మించారు. కోర్టులు జోక్యం చేసుకున్నా అధికారంతో దీనిని నిర్మించారు. నేను ప్రపంచంలో ఎన్నో దేశాలు తిరిగాను. కానీ ఇలాంటి అత్యాధునిక సౌకర్యాలు ఎక్కడా చూడలేదన్నారు.
రిషికొండ బాత్ టబ్ కు రూ.36 లక్షలు, కమోడ్ కు రూ.12 లక్షలు వెచ్చించడం దారుణం అన్నారు. ఈ ప్యాలెస్ కు రూ.450 కోట్ల ఖర్చు చేశారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి భవనాలు కట్టడం దారుణం. ఒక సీఎం తన విలాసాల కోసం ప్యాలెస్ కట్టుకోవడం దుర్మార్గం. జగన్ ఏమైనా రారాజు అనుకుంటున్నారా?’ అని ఆయన ఫైర్ అయ్యారు.
తానే 30 ఏళ్ళు సియం అనే పిచ్చలో, కేవలం తన కుటుంబం ఉండటం కోసం, బీచ్ వ్యూ ప్యాలెస్ కోరికతో, రుషికొండని కొట్టేసి, జగన్ రెడ్డి కట్టిన రూ.500 కోట్ల రుషికొండ ప్యాలెస్ ఇది.
ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా రుషికొండ ప్యాలెస్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పరిశీలిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం… pic.twitter.com/E3kyUNHRCk
— Telugu Desam Party (@JaiTDP) November 2, 2024
Read Also : TTD: నవంబర్ 06 న టీటీడీ బోర్టు కొత్త చైర్మన్‌గా బీఆర్ నాయుడు బాధ్యతల స్వీకరణ