HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu Health Bulletin Petition Hearing Will Be Held Today In Acb Court

Chandrababu – ACB Court : చంద్రబాబు హెల్త్‌ బులెటిన్ పై ఇవాళ ఏసీబీ కోర్టులో విచారణ

Chandrababu - ACB Court : చంద్రబాబు ఆరోగ్యంపై హెల్త్‌ బులెటిన్ విడుదల చేయడం లేదంటూ ఆయన తరఫు న్యాయవాదులు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

  • Author : Pasha Date : 17-10-2023 - 7:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandrababu1
Chandrababu1

Chandrababu – ACB Court : చంద్రబాబు ఆరోగ్యంపై హెల్త్‌ బులెటిన్ విడుదల చేయడం లేదంటూ ఆయన తరఫు న్యాయవాదులు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు(మంగళవారం) ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. తమకు ఎప్పటికప్పుడు చంద్రబాబు హెల్త్ రిపోర్ట్ ను ఇవ్వాలని కోరుతూ ఆయన కుటుంబ సభ్యులు ఈ పిటిషన్ వేశారు. హెల్త్‌ బులెటిన్లను ఇవ్వడానికి సంబంధిత అధికారులు నిరాకరించారని ఈ పిటిషన్‌లో ఆరోపించారు. సోమవారం రోజు ఈ పిటిషన్ ను పరిశీలించిన ఏసీబీ కోర్టు జడ్జి.. ‘‘చంద్రబాబు ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన రిపోర్ట్స్ ను మెయిల్‌లో పంపామని అధికారులు చెబుతున్నారు. ఫిజికల్ కాపీ అందగానే ఇస్తామని అంటున్నారు’’ అని చంద్రబాబు లాయర్లకు చెప్పారు. దీనిపై లాయర్లు  స్పందిస్తూ.. ‘‘ చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు మా క్లయింట్ కు నివేదిక ఇవ్వలేదు. ఈ నెల 12న వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత జైలు అధికారులు మాకు ఎలాంటి రిపోర్ట్ లను ఇవ్వలేదు. అధికారులు చెప్పిన అంశాలతోనే రిపోర్ట్ ఇస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబసభ్యులతో పాటు పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది’’ అని కోర్టుకు తెలిపారు. ఇవాళ ఈ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు(Chandrababu – ACB Court) విచారణ చేపట్టనుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇక చంద్రబాబు శరీరం రంగు మారిందని, చర్మంపై దద్దుర్లు, అలెర్జీ వచ్చినట్లు రాజమండ్రి ప్రభుత్వ వైద్యులు ఇచ్చిన మెడికల్ రిపోర్ట్ తో కలకలం రేగింది. చంద్రబాబును చల్లని వాతావరణంలో ఉంచాలని అందులో సూచించారు. ఈ క్రమంలో చంద్రబాబుకు ఏసీ సౌకర్యం కల్పించాలని జైలు అధికారులకు ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందంటూ ఆదివారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. వైద్యులు ఎప్పటికప్పుడు బాబుకు టెస్ట్‌లు చేస్తున్నారని, మెడిసిన్స్ కూడా సిఫార్సు చేస్తున్నారని తెలిపారు. కోర్టు ఆదేశాలతో చంద్రబాబుకు ఏసీ కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

Also Read: Ekambareswarar Temple : కాంచీపురంలోని ఏకాంబరేశ్వర దేవాలయం చూసి తరించండి..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ACB Court
  • chandrababu
  • Health Bulletin Petition
  • Hearing Today

Related News

Sarpanch Election Updates I

Sarpanch Elections Updates in AP : ఏపీలో సర్పంచ్ ఎన్నికలు

ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగడం అసాధ్యమని స్పష్టమవుతోంది. బీసీ రిజర్వేషన్ల కమిషన్ నివేదిక అందిన తర్వాతే ప్రభుత్వం వార్డుల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేస్తుంది, ఆపై ఎన్నికల సంఘం తుది నోటిఫికేషన్ విడుదల చేస్తుంది

    Latest News

    • మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధర

    • మోదీ ఒక్క ఫోన్ కాల్ చేస్తే యుద్ధం ఆగిపోతుంది

    • వాణిజ్య సిలిండర్ల నిలిపివేతతో.. మూసివేత దిశగా హోటళ్లు, రెస్టారెంట్ల..

    • Sunstroke : వడదెబ్బతో చనిపోతే తెలంగాణ సర్కార్ రూ.4 లక్షల పరిహారం

    • Royal Stag Boom Box : రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్‌తో హోరెత్తిన విశాఖ తీరం

    Trending News

      • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

      • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

      • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

      • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

      • టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసిన భార‌త్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd