AP Auto Drivers : ఆటోడ్రైవర్లకు అండగా చంద్రబాబు
AP Auto Drivers : ఇప్పటికే "తల్లికి వందనం" (Thalliki Vandanam) వంటి పథకాలు సైలెంట్‌గా అమలవుతున్న నేపథ్యంలో, ఉచిత బస్సు ప్రయాణ పథకం (Free Bus) మహిళల కోసం మరో బంపర్ ఆఫర్‌గా మారబోతోంది
- By Sudheer Published Date - 08:07 PM, Tue - 24 June 25

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం (Kutami Govt) మరో కీలక హామీ అమలుకు రంగం సిద్ధం చేసింది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ఈ ఏడాది ఆగస్ట్ 15 నుండి ప్రారంభించబోతున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇప్పటికే “తల్లికి వందనం” (Thalliki Vandanam) వంటి పథకాలు సైలెంట్‌గా అమలవుతున్న నేపథ్యంలో, ఉచిత బస్సు ప్రయాణ పథకం (Free Bus) మహిళల కోసం మరో బంపర్ ఆఫర్‌గా మారబోతోంది. ఈ పథకం అమలుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహిళల ప్రయాణ ఖర్చు తగ్గించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ పథకాన్ని తెరపైకి తీసుకొచ్చారు.
Jamili Elections : జమిలి ఎన్నికలపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
అయితే ఈ పథకం అమలుతో ఆటో డ్రైవర్లకు ఉపాధి తగ్గుతుందనే అనుమానాలు వ్యాపించాయి. మహిళలు ఇక బస్సుల వైపు మొగ్గుచూపుతారు కాబట్టి ఆటోల్లో రోజువారీ ప్రయాణికుల సంఖ్య తగ్గే అవకాశముంది. తెలంగాణలో కూడా ఇదే విధమైన అనుమానాలు రావడం..మొదట్లో ఫ్రీ బస్సు ద్వారా ఆటోల వైపు చూడకున్న..ఆ తర్వాత బస్సుల్లో రాష్ చూసి ఆటోలు ఎక్కడం మొదలుపెట్టారు. ఇక ఇప్పడు ఏపీలో కూడా అలాంటి పరిస్థితే రాబోతుందని గ్రహించిన బాబు.. టీడీపీ అధికారిక ఖాతా ద్వారా ఒక కీలక ప్రకటన చేసారు. ఉచిత బస్సు ప్రయాణం అమలైన వెంటనే ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంటే ఈ పథకం వల్ల మహిళలే కాదు, ఆటో డ్రైవర్లకు కూడా ఉపశమనం లభించనుంది.
Raitu Nestam program : మా ప్రజాప్రభుత్వంలో మొదటి ప్రాధాన్యం రైతులే : సీఎం రేవంత్ రెడ్డి
ప్రత్యక్షంగా ప్రయోజనం పొందే మహిళలు అయినా, పరోక్షంగా ప్రభావితమయ్యే ఆటో డ్రైవర్లను ప్రభుత్వం విస్మరించకపోవడం అభినందనీయంగా మారింది. జగన్ హయాంలో ఆటో డ్రైవర్లకు కొంత ఆర్థిక సాయం అందించబడింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకం కొనసాగలేదనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మహిళలకు ప్రయోజనం కలిగించే పథకాన్ని ప్రారంభించడమే కాక, అదే సమయంలో ఆటో డ్రైవర్ల ప్రయోజనాలకూ అంకితంగా వ్యవహరించడం, ప్రభుత్వం సమతుల్యమైన నిర్ణయాలు తీసుకుంటోందని స్పష్టంగా చూపిస్తుంది. దీని ద్వారా అన్ని వర్గాలకు మేలు చేసే అభివృద్ధి దిశగా కూటమి అడుగులు వేస్తోందని చెప్పవచ్చు.