HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu Gives Counter To Cm Jagan On Kuppam Incident

Chandrababu: నీ మాదిరి నేను పోలీసులను వినియోగించి ఉంటే.. నీవు బయట తిరిగేవాడివా?: చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన మూడో రోజు కొనసాగుతోంది. ఈ రోజు ఆయన కుప్పం వీధుల్లో రోడ్ షో నిర్వహించారు.

  • Author : Hashtag U Date : 26-08-2022 - 5:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandrababu Kadapa
Chandrababu Kadapa

టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన మూడో రోజు కొనసాగుతోంది. ఈ రోజు ఆయన కుప్పం వీధుల్లో రోడ్ షో నిర్వహించారు. ఎక్కడికక్కడ జనాలతో మాట్లాడుతూ ముందుకు సాగారు. కుప్పం మోడల్ కాలనీలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 650 గృహాలతో మోడల్ కాలనీ నిర్మాణాన్ని ప్రారంభించామని… 1 ప్లస్ 3 విధానంతో 3 వేల మందికి దీన్ని విస్తరించాలనే ఉద్దేశంతో ప్రణాళికలను రూపొందించి అనుమతులు ఇచ్చామని చెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇళ్ల నిర్మాణాన్ని ఆపేశారని మండిపడ్డారు.

కుప్పంపై ఏదో ప్రత్యేకమైన ప్రేమ ఉన్నట్టు జగన్ అంటున్నారని… అంత ప్రేమ ఉంటే తాను 3 వేల ఇళ్లను కట్టిస్తే… ఆయన 10 వేల ఇళ్లను కట్టించాలని చంద్రబాబు ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో రాజకీయాలు తప్ప అభివృద్ధే లేదని విమర్శించారు. జగన్ నియోజకవర్గం పులివెందులను తాను అభివృద్ధి చేశానని… గండికోట నుంచి నీళ్లిచ్చానని చెప్పారు.

కుప్పం చరిత్రలో నిన్న ఒక చీకటి రోజని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పేద వాడి పొట్ట నింపే అన్నా క్యాంటీన్ ను ధ్వంసం చేశారని మండిపడ్డారు. క్యాంటీన్ నిర్వాహకుడిపై కూడా దాడి చేశారని చెప్పారు. డీఎంకే ప్రభుత్వంలో ప్రారంభించిన అమ్మ క్యాంటీన్లను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇప్పటికీ కొనసాగిస్తున్నారని… ఇక్కడేమో ఈయన అధికారంలోకి వచ్చిన వెంటనే క్యాంటీన్లను ఎత్తేశాడని దుయ్యబట్టారు.

ఎమ్మెల్సీ భరత్ ఇంటి వద్ద వందలాది మంది పోలీసులను భద్రతగా పెట్టారని… ఇదే పోలీసులను అన్నా క్యాంటీన్ వద్ద ఎందుకు పెట్లలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసులు సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను కూడా ఇలాగే పోలీసులను వినియోగించి ఉంటే నీవు బయట తిరిగే వాడివా? అని జగన్ ను ఉద్దేశించి అన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లా ఎస్పీ కుప్పంలో ఉన్నప్పుడే వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారని తెలిపారు. ఈ పరిణామాలన్నింటికీ డీజీపీ సమాధానం చెప్పాలని అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu naidu
  • cm jagan
  • kuppam incident
  • TDP chief

Related News

Chandrababu Naidu

Women’s Reservation Bill : దేశ చరిత్రలో ఇదొక బ్లాక్ డే అంటూ చంద్రబాబు ఆవేదన

కేవలం విమర్శలతోనే సరిపెట్టకుండా, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు. ప్రతి ఇంటికీ వెళ్లి విపక్షాలు మహిళా బిల్లు విషయంలో చేసిన ద్రోహాన్ని ఎండగడతామని ఆయన ప్రకటించారు. మహిళా సాధికారత అనేది తెలుగుదేశం మరియు ఎన్డీయే కూటమి ప్రధాన అజెండా అని, బిల్లు వీగిపోయినా తమ పోరాటం ఆగదని స్పష్టం

  • Telugu Desam Party Appoints

    NARA LOKESH: పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్

  • Telugu Desam Party Appoints Nara Lokesh as Working President

    Telugu Desam Party: పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd