Chandrababu Naidu: ఇలాంటి నిబంధన ఏ రాష్ట్రంలోనూ ఉండదు-చంద్రబాబు ఫైర్..!!
ఏపీ సర్కార్ పై ఏపీ ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.
- By hashtagu Published Date - 01:11 PM, Fri - 3 June 22

ఏపీ సర్కార్ పై ఏపీ ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. బిల్లుల కోసం కాంట్రాక్టర్లు కోర్టులకు వెళ్లొదంట్టూ టెండర్లలో ప్రభుత్వం పెట్టిన నిబంధనలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం మూడేళ్ల పాలన రాష్ట్రాన్ని 30ఏళ్ల వెనక్కు తీసుకెళ్లిందంటూ విమర్శించారు. బిల్లుల కోసం కోర్టులకు వెళ్లరాదంటూ టెండర్లలో నిబంధనలు పెట్టడం రాష్ట్ర దుస్థికి..అసమర్థ పాలనకు నిదర్శనమంటూ మండిపడ్డారు.
కృష్ణా డెల్టా కాలువల మరమ్మతుల కోసం రూ. 13కోట్ల టెండర్ పనులకు పెట్టిన ఆ నిర్ణయం రాష్ట్ర పరువును మంటగలిపిందని…అసమర్థపాలకులకు సిగ్గనిపించకపోయినా…ప్రభుత్వం నిజంగా సిగ్గపడే నిర్ణయమన్నారు. ఇలాంటి నిబంధనలు దేశంలోని మరే ఇతర రాష్ట్రంలోనూ ఉండవన్నారు. న్యాయం కోసం కోర్టుకు వెళ్లే హక్కు లేదన్న నిబంధన పెట్టే హక్కు సర్కార్ కు ఎవరిచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు. బిల్లుల కోసం కోర్టుకు వెళ్లరాదన్న షరతులు పెట్టే స్థితికి రాష్ట్రం దిగజారిందంటూ ఫైర్ అయ్యారు. అసలు ఇలాంటి ముఖ్యమంత్రిని ఏమనాలన్నారు. రాష్ట్రంలో రూ. లక్షన్నర కోట్లు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్న చంద్రబాబు…దాని వల్ల కాంట్రాక్టర్లు, ఆయా సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందిపై ఎంత ప్రభావం చూపుతుందో ఈ మూర్ఖపు ప్రభుత్వానికి అర్ధం కాదని మండిపడ్డారు.
బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం వల్ల నిర్మాణ, వ్యాపార, సేవల రంగంలో లక్షల మంది ఉపాధి కోల్పోవడానికి జగన్ కారణమయ్యారని ఫైర్ అయ్యారు. రూ. 13కోట్ల పనులకే ధైర్యంగా పిలవలేని ప్రభుత్వం…నీటిపారుదల ప్రాజెక్టులున పూర్తి చేస్తుందా అని ప్రశ్నించారు. అంతేకాదు మూడు రాజధానులను ఎలా నిర్మిస్తుందంటూ బాబు నిలదీశారు. సీఎం వైఫల్యం వల్లే రాష్ట్రం పరువు దెబ్బతిన్నదన్నారు. అభివ్రుద్ధి పథంలో ముందుకు వెళ్తున్న రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టి ప్రజలకు జగన్ ద్రోహం చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ సర్కార్ 3 ఏళ్ల వైఫల్యాల రివర్స్ పాలన రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకుపోయింది. కాంట్రాక్టర్లను బిల్లుల కోసం కోర్టుకు వెళ్లొద్దు అని టెండర్ డాక్యుమెంట్ లోనే నిబంధన పెట్టడం రాష్ట్ర దుస్థితికి, అసమర్థ పాలనకు నిదర్శనం.(1/6) pic.twitter.com/h0ElmI5u4s
— N Chandrababu Naidu (@ncbn) June 3, 2022