Davos Tour : మనం జాబ్ అడగడం కాదు, ఇచ్చే స్థితిలో ఉండాలి – చంద్రబాబు
Davos Tour : "మన యువత ఉద్యోగాలను అడిగే స్థాయి నుంచి, అందించే స్థాయికి ఎదగాలి" అనే దృఢ సంకల్పంతో పని చేస్తున్నామని తెలిపారు
- By Sudheer Published Date - 03:02 PM, Sat - 25 January 25

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పునరుద్ధరణకు దావోస్ టూర్ కీలకమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రపంచంలోని ప్రతిష్టాత్మక కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు జరపడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించడం ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. “మన యువత ఉద్యోగాలను అడిగే స్థాయి నుంచి, అందించే స్థాయికి ఎదగాలి” అనే దృఢ సంకల్పంతో పని చేస్తున్నామని తెలిపారు.
మొదటిసారిగా నేను 1997 లో దావోస్ కు వెళ్ళాను, తనను అనుసరించి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వడం మొదలుపెట్టారు. ఈసారి జరిగిన టూర్లో 27 వన్-టు-వన్ సమావేశాలు, నాలుగు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నామని, ఏపీ బ్రాండ్‌ను మళ్లీ గ్లోబల్ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, నేచర్ ఫార్మింగ్ లాంటి సాంకేతికతలు చర్చకు వచ్చాయని వివరించారు.
Vande Bharat Train : అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన పై వందేభారత్ రైలు తొలి కూత
గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసాన్ని సమీకరించి అభివృద్ధి పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖలో గూగుల్ సర్వీసెస్ సెక్టార్, రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ, కాకినాడలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్ని ప్రవేశపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. మొత్తం రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నామని అన్నారు.
తెలుగు ప్రజల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడంలో తమ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని చంద్రబాబు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో తెలుగు ప్రజలు ఉన్నారని, రాబోయే ఐదేళ్లలో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని చెప్పారు. “సాధారణ వ్యక్తులను అసాధారణ వ్యక్తులుగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం” అని ఆయన అన్నారు. భవిష్యత్‌లో గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ఏపీ కీలక హబ్‌గా మారబోతోందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. దేశం సుదీర్ఘకాలం జీడీపీ వృద్ధి రేటులో అగ్రస్థానంలో నిలిచేందుకు యువ భారత్ విశేష పాత్ర పోషిస్తుందని అన్నారు.
ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడితే ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నాం. 1995లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.. 2025లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ . ఇది 30 సంవత్సరాల చరిత్ర . ఉద్యోగం అడగడం కాదు..ఉద్యోగం ఇచ్చే స్థాయికి యువత ఎదగాలి. 100 దేశాల్లో తెలుగు వాళ్లు ఉన్నారు. రాబోయే ఐదేళ్లలో ప్రపంచంలోని అన్ని దేశాల్లో మన వాళ్లు ఉంటారు చంద్రబాబు జోస్యం చెప్పారు.