Chandrababu Remand : చంద్రబాబు కస్టడీ పిటిషన్ ఫై తీర్పు వాయిదా…
చంద్రబాబు (Chandrababu) కస్టడీ పిటిషన్ ఫై ఏసీబీ కోర్ట్ (ACB Court) స్పదించింది. క్వాష్ పిటిషన్ ఫై తీర్పు వచ్చాకే..కస్టడీ పిటిషన్ ఫై తీర్పు వెల్లడిస్తామని ఏసీబీ కోర్ట్ స్పష్టత ఇచ్చింది. ఈరోజు మధ్యాహం 1:30 కి హైకోర్టు క్వాష్ పిటిషన్ ఫై తీర్పు వెల్లడించనుంది. ఆ తీర్పు వచ్చాకే కస్టడీ పిటిషన్ ఫై ఓ క్లారిటీ రానుంది.
- By Sudheer Published Date - 11:40 AM, Fri - 22 September 23
చంద్రబాబు (Chandrababu) కస్టడీ పిటిషన్ ఫై ఏసీబీ కోర్ట్ (ACB Court) స్పదించింది. క్వాష్ పిటిషన్ ఫై తీర్పు వచ్చాకే..కస్టడీ పిటిషన్ ఫై తీర్పు వెల్లడిస్తామని ఏసీబీ కోర్ట్ స్పష్టత ఇచ్చింది. ఈరోజు మధ్యాహం 1:30 కి హైకోర్టు క్వాష్ పిటిషన్ ఫై తీర్పు వెల్లడించనుంది. ఆ తీర్పు వచ్చాకే కస్టడీ పిటిషన్ ఫై ఓ క్లారిటీ రానుంది.
అంతకు ముందు ఈ నెల 24 వరకు చంద్రబాబు రిమాండ్ (Chandrababu Remand ) ను పొడగిస్తున్నట్లు తెలిపింది. కానీ ఆ తర్వాత తీర్పును వాయిదా వేసింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసు (Skill Development)లో పెద్ద కుట్ర దాగుందని, దానిని వెలికి తీయాలంటే.. చంద్రబాబును తమ కస్టడీకి ఇవ్వాల్సిందేనని సీఐడీ తరఫున న్యాయవాదులు తమ వాదనలను బలంగా వినిపించారు.
ఇప్పటికే విచారణ ముగిసి రిమాండ్ ఖైదీగా ఉన్నారని, ఇక కస్టడీ అవసరం లేదని చంద్రబాబు తరఫున న్యాయవాదులు వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం..చంద్రబాబు రిమాండ్ ఫై తీర్పును హోల్డ్ లో పెట్టింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన చంద్రబాబు రిమాండ్ గడువు నేటితో ముగియనుంది. ఈ క్రమంలో ఈరోజు చంద్రబాబు ఏసీబీ కోర్టులో వర్చువల్ విధానంలో హాజరయ్యారు. న్యాయమూర్తి ఎదుట చంద్రబాబు తన ఆవేదనను వ్యక్తం చేసారు. జైలులో ఉంచి మానసిక క్షోభకు గురిచేస్తున్నారని చంద్రబాబు న్యాయమూర్తికి వివరించారు. తన హక్కులను రక్షించాలని, న్యాయాన్ని కాపాడాలని జడ్జిని కోరారు. “45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం నాది. నాకు నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేశారు. నా తప్పు ఉంటే విచారణ చేసి అరెస్టు చేయాల్సింది. నేను చేసిన అభివృద్ధి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. అన్యాయంగా నన్ను అరెస్టు చేసారని న్యాయమూర్తి తో చెప్పుకున్నారు.
దీనికి న్యాయమూర్తి సైతం చంద్రబాబు కు బాసటగా నిలిచినట్లు తెలుస్తుంది. మీరు పోలీస్ రిమాండ్ లో లేరని జ్యుడీషియల్ కస్టడీలో మాత్రమే ఉన్నారని..జ్యుడీషియల్ కస్టడీలో ఉంటె తప్పు చేసినట్లు కాదని , మీపై ఓ ఆరోపణ వచ్చింది..దానిని నిరూపించుకోవచ్చని అంతే తప్ప మీరు నేరం చేసినట్లు కాదని బాబు కు న్యాయమూర్తి చెప్పినట్లు తెలుస్తుంది. మీ భద్రత విషయంలో ఎలాంటి సందేహాలు వద్దని, మీ పూర్తి భద్రత మాదేనని న్యాయమూర్తి చంద్రబాబు కు చెప్పినట్లు సమాచారం. అలాగే మరికొన్ని విషయాలు న్యాయమూర్తి వద్ద తెలిపేందుకు బాబు సిద్ధం అయ్యారు. ఈ తరుణంలో బాబు కు పది నిమిషాల సమయం న్యాయమూర్తి కేటాయించినట్లు తెలుస్తుంది.
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో ఈ నెల 9న చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారించిన ఏసీబీ కోర్టు.. చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది. అంటే ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ విధించారు. నేటితో కస్టడీ ముగియనుండగా.. కోర్టు ఆదేశాల మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏసిబి కోర్టు న్యాయమూర్తి ఎదుట చంద్రబాబు హాజరు అయ్యారు.
Also Read : Ap Assembly : రెండో రోజు కూడా అదే గందరగోళం..విజిల్ వేస్తూ హల్చల్ చేసిన బాలకృష్ణ
Related News
CBN – Supreme Court: చంద్రబాబు క్వాష్ పిటిషన్.. సీజేఐకి నివేదించిన ద్విసభ్య ధర్మాసనం
CBN - Supreme Court: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది.