Chandrababu Class : అధికారాన్ని తలకెక్కించుకోవద్దని మంత్రులకు చంద్రబాబు క్లాస్
పార్టీ కార్యాలయంలో మంత్రులు అందుబాటులో ఉండాల్సిందేనని స్పష్టం చేసారు. ఇంకా.. ఎమ్మెల్యేలతో పంతాలకు పోకుండా సమన్వయంతో వెళ్లాలని, అధికారాన్ని తలకెక్కించుకోవద్దని మంత్రులకు చంద్రబాబు క్లాస్
- By Sudheer Published Date - 05:18 PM, Tue - 16 July 24

ఏపీలో కూటమి సర్కార్ (AP NDA Govt) అధికారంలోకి వచ్చి నెల రోజులు పూర్తి అయ్యింది. ఈ నెల రోజుల్లో ఎన్నో కీలక నిర్ణయాలు..పలు హామీలను నెరవేర్చింది. మంత్రులు సైతం తమ శాఖల్లో బిజీ అయ్యారు. గడిచిన ఐదేళ్ల లో జగన్ సర్కార్ ఏంచేసింది..?ఎలాంటి తప్పులు చేసింది..? ఏ ఏ శాఖలో ఎన్ని నిధులు ఉన్నాయి..? నెక్స్ట్ ఏంచేయాలి అనేది అధికారులతో చర్చలు జరుపుతూ వస్తున్నారు. ఇదే క్రమంలో పలువురు మంత్రులు అప్పుడే అధికారాన్ని తలకెక్కించుకునే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. ఈ తరుణంలో అలాంటి మంత్రులకు (Ministers ) చంద్రబాబు (Chandrababu ) క్లాస్ పీకారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈరోజు వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం (AP Cabinet Meeting ) జరిగింది. ఈ సమావేశంలో మంత్రులంతా పాల్గొన్నారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ కేబినెట్ భేటీలో అనేక కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర పడింది. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లుతో పాటు కొత్త ఇసుక విధానానికి కెబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో కొత్త ఇసుక పాలసీపై ప్రభుత్వం త్వరలో విధి విధానాలను రూపొందించనుంది. ఇంకా పౌర సరఫరాల శాఖ రూ. 2 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారెంటీ ఇచ్చేందుకు సైతం మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం ఎన్సీడీసీ నుంచి రూ. 3200 కోట్ల రుణానికి వ్యవసాయ సహకార కార్పోరేషన్ కు ప్రభుత్వ గ్యారెంటీకి కెబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే పలు వాటికీ ఆమోదం తెలిపింది.
ఇదే క్రమంలో చంద్రబాబు మంత్రులకు కీలక సూచనలు తెలియజేసారు. ప్రభుత్వం పూర్తిగా లోటు బడ్జెట్ లో ఉందని.. అది గ్రహించి మసలుకోవాలని మంత్రులకు సీఎం సూచించారు. HODలతో సహా శాఖలకు సంబంధించిన అంశాలపై నెల నెలా సమీక్షలు చేపట్టాలని, తమ తమ శాఖలకు చెందిన పరిస్థితిని ప్రజలకు నిత్యం వివరిస్తూ ఉండాలని సూచించారు. పార్టీ కార్యాలయంలో మంత్రులు అందుబాటులో ఉండాల్సిందేనని స్పష్టం చేసారు. ఇంకా.. ఎమ్మెల్యేలతో పంతాలకు పోకుండా సమన్వయంతో వెళ్లాలని, అధికారాన్ని తలకెక్కించుకోవద్దని మంత్రులకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు.
Read Also : Etala Rajender : రుణమాఫీ నిబంధనలు రైతులకు ఉరితాడుగా మారాయి