Chandrababu Arrest : చంద్రబాబు అరెస్టుకు ఏడాది..ఇదే రోజు వైసీపీ పతనం మొదలు
Chandrababu Illegal Arrest : తమ వివాహ వార్షికోత్సవం రోజునే చంద్రబాబును జైలుకు తరలించడంతో ఆయన భార్య భువనేశ్వరి, కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
- By Sudheer Published Date - 12:24 PM, Mon - 9 September 24

Chandrababu Arrest 1 Year Completed : స్కిల్ డెవలప్మెంట్ కేసు (Skill Development Case)లో చంద్రబాబును CID గతేడాది ఇదేరోజున (సెప్టెంబర్ 09) అరెస్ట్ (Chandrababu Arrest) చేసింది. నంద్యాల నుంచి విజయవాడకు రోడ్డు మార్గంలో తరలించగా, తన రాజకీయ జీవితంలో చంద్రబాబు తొలిసారి జైలు జీవితం గడిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పరిధిలో అక్రమాలు జరిగాయన్న అభియోగంతో నాటి వైసీపీ ప్రభుత్వం (YCP Govt) చంద్రబాబును అరెస్టు చేయించింది. చంద్రబాబు ను అరెస్ట్ చేసి ఏదో పెద్ద విజయం , ఘనత సాధించామని వైసీపీ నేతలు భావించారు..కానీ చంద్రబాబు అరెస్ట్ తోనే వారి పతనం మొదలైందని ఆలస్యంగా తెలుసుకున్నారు. ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించడంతో వైద్య పరీక్షల అనంతరం ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. తమ వివాహ వార్షికోత్సవం రోజునే చంద్రబాబును జైలుకు తరలించడంతో ఆయన భార్య భువనేశ్వరి, కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. చంద్రబాబు అరెస్టును అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయి. చంద్రబాబు విడుదలయ్యే వరకు తెలుగు ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి సంఘీభావం తెలిపారు.
చంద్రబాబు కోసం రోడ్ ఫై పడుకుని పవన్ కళ్యాణ్ నిరసన
చంద్రబాబు అరెస్టు(Chandrababu Arrest)తో రాష్ట్రమంతా ఆందోళనలు ఉవ్వెత్తున ఎగిశాయి. ఆయన్ను రోడ్డుమార్గంలో నంద్యాల నుంచి విజయవాడ తీసుకొస్తున్న సమయంలో అడుగడుగునా టీడీపీ శ్రేణులు అడ్డుపడ్డాయి. పెద్దఎత్తున పోలీసుల్ని మొహరించి వారిని లాఠీలతో చితకబాదుతూ ఈడ్చిపడేశారు. చంద్రబాబుకు సంఘీభావం తెలియజేసేందుకు హైదరాబాద్ నుంచి వస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్‌ను విమానంలో రాకుండా అడ్డుకున్నారు. రోడ్డు మార్గాన వస్తుండగా పోలీసులు రాష్ట్ర సరిహద్దుల్లోనే అడ్డుకున్నారు. దీంతో పవన్ (Pawan Kalyan) రోడ్డుపై పడుకుని నిరసన తెలియజేశారు.
చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) ను నిరసిస్తూ యావత్ తెలుగు ప్రజానీకం ఆందోళన
చంద్రబాబు త్వరగా విడుదల కావాలంటూ ఆలయాల్లో పూజలు చేసేందుకు వెళ్తున్న వారిపైనా పోలీసులు ఉక్కుపాదం మోపి అడ్డుకున్నారు. గృహనిర్బంధాలు అమలు చేశారు. ఎన్నడూ ఇంటి నుంచి కదలని మహిళలూ పోలీసు నిర్బంధాన్ని దాటుకుని రోడ్డెక్కి చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు. ఆయన అరెస్టును నిరసిస్తూ ఐటీ ఉద్యోగులు ఏకతాటిపైకి వచ్చి ఆందోళనలు నిర్వహించారు. హైదరాబాద్‌లో పెద్దఎత్తున ఉద్యమించారు. బెంగళూరు, చెన్నైతోపాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పలుచోట్ల సంఘీభావ ప్రదర్శనలు చేపట్టారు.
బయటకు రాని భువనేశ్వరి (Nara Bhuvaneshwari) సైతం బాబు కోసం ప్రజల్లోకి
చంద్రబాబు రెండుమూడు రోజుల్లోనే బయటకు వచ్చేస్తారని అందరూ భావించారు. అయితే, 53 రోజుల వరకు ఆయన జైలులోనే ఉండాల్సి వచ్చింది. అధినేత జైలులో ఉన్నప్పటికీ టీడీపీ శ్రేణులు, నారా, నందమూరి కుటుంబ సభ్యులు ప్రజల్లోకి వెళ్లారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని చాటారు. రాజకీయ కుట్రలో భాగంగానే అరెస్ట్ చేశారని నినదించారు. ఎన్నడూ బయటకు రాని భువనేశ్వరి సైతం ప్రజల్లోకి వెళ్లారు. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించారు. బాబు అరెస్ట్‌పై ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. చివరికి 53వ రోజున అంటే 31 అక్టోబర్ 2023న జైలు నుంచి విడుదలయ్యారు.
చంద్రబాబు అరెస్ట్ ను తట్టుకోలేక ఎంతో మంది ప్రాణాలు (Many People Lost Their Lives) విడిచారు
అమెరికా, యూకే, దుబాయ్ సహా సుమారు 70 దేశాల్లో ఐటీ ఉద్యోగులు, వివిధ రంగాలకు చెందిన తెలుగు ప్రజలు ర్యాలీలు చేపట్టారు. చంద్రబాబు అరెస్టుతో కలత చెంది రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రాణాలు విడిచారు. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో జైలువాసం గడపడం ఇదే ప్రథమం. రాజకీయ వైరుధ్యాలు ఎన్ని ఉన్నా గతంలోని ఆయన ప్రత్యర్థి ప్రభుత్వాలు ఆయనను అరెస్టు చేసే సాహసం చేయలేకపోయాయి. అప్పటి ముఖ్యమంత్రి జగన్ మాత్రం చంద్రబాబును అరెస్ట్ చేశారు. చంద్రబాబు అరెస్ట్‌తో ఆతర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి బాటలు వేసింది. అప్పటికే పతన దిశలో ఉన్న వైసీపీ మరింత వేగంగా పతనమై అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లకు పరిమితమైంది. ఆ పార్టీ అధినేత జగన్‌కు అసెంబ్లీలో విపక్ష నేతహోదా కూడా లభించలేదు. ఈ పరిణామాలన్నింటి వెనుక చంద్రబాబు అరెస్టు కీలక పాత్ర పోషించింది.
Read Also : Hero Splendor Plus: కొత్త ఫీచర్స్ విడుదలైన హీరో స్ప్లెండర్ బైక్.. ప్రత్యేకతలు ఇవే!