Chandrababu – Lokesh : చంద్రబాబు, లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్లపై కాసేపట్లో విచారణ
Chandrababu - Lokesh : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం కేసులో ముందస్తు బెయిల్ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరుగనుంది.
- By Pasha Published Date - 10:40 AM, Fri - 29 September 23

Chandrababu – Lokesh : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం కేసులో ముందస్తు బెయిల్ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరుగనుంది. లోకేష్ పిటిషన్ పై ఈరోజు ఉదయం ఫస్ట్ అవర్ లో, చంద్రబాబు పిటిషన్ పై మధ్యాహ్నం 2:15 గంటలకు న్యాయస్థానంలో విచారణ జరుగుతుంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అనేది చంద్రబాబు హయాంలో అమరావతిలోని అన్ని రోడ్లను కలుపుతూ చేపట్టిన భారీ ప్రాజెక్ట్. ఇందులో భారీ స్కామ్ జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కంప్లైంట్ చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌లో అక్రమాలకు పాల్పడ్డారు అనేది ప్రధాన అభియోగం.
Also read : Sandeep Reddy Vang : సందీప్ వంగ.. నెక్స్ట్ బిగ్ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ సినిమా..!
ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో గతేడాది రంగంలోకి దిగింది ఏపీ సీఐడీ. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబును ఏ1గా, మాజీ మంత్రి నారాయణను ఏ2గా, నారా లోకేష్‌ను ఏ14గా చేర్చుతూ మెమో దాఖలు చేసింది. ఈ కేసులో నారాయణ ఇప్పటికే ముందస్తు బెయిల్ పొందారు. చంద్రబాబు, లోకేష్‌లు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఇవాళ కోర్టులో విచారణ జరగనుంది. ఇక అంగళ్ళ అల్లర్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇప్పటికే వాదనలు పూర్తి అయ్యాయి. ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అంగళ్ళ అల్లర్ల కేసులో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తుందా? లేక హైకోర్టు బెయిల్ తిరస్కరిస్తుందా? అని చంద్రబాబు, సీఐడీ తరఫున న్యాయవాదులు (Chandrababu – Lokesh) ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.