HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandra Babu Naidu Tells Sarpanchs To Fight For Their Rights

NCBN: రాజ్యాంగం ఇచ్చిన హక్కుల కోసం సర్పంచ్ లు పోరాడాలి – టీడీపీ అధినేత చంద్ర‌బాబు

తెలుగు దేశం పార్టీ నుంచి గెలిచిన గ్రామ సర్పంచ్ లు నిజమైన హీరో లు అని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

  • Author : Hashtag U Date : 24-02-2022 - 10:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

అమరావతి: తెలుగు దేశం పార్టీ నుంచి గెలిచిన గ్రామ సర్పంచ్ లు నిజమైన హీరో లు అని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైసిపి డబ్బు, అధికారం, ఒత్తిళ్లు వంటి సవాళ్లను ఎదుర్కొని ఎన్నికల్లో పోరాడి గెలిచిన మీరే నిజమైన హీరోలు అంటూ చంద్రబాబు సర్పంచ్ లను ప్రశంసించారు. టిడిపి కేంద్ర కార్యాలయంలో జరిగిన సర్పంచ్ ల అవగాహన సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు.

రాజ్యాంగం సర్పంచ్ లకు ఇచ్చిన హక్కులపై పోరాటం చెయ్యాలని పిలుపు నిచ్చారు. దేశంలో మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఉన్నట్లు…గ్రామంలో సర్పంచ్ ప్రభుత్వం ఉంటుందని అన్నారు. పంచాయతీలకు రావాల్సిన డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుంటే దొపిడీ అనాలా..? ఇంకేమైనా అనాలా..? అని ప్రశ్నించారు. చెత్తపన్ను వసూలు చేసేదే లేదని పంచాయతీల్లో తీర్మానం చేయాలి అని చంద్రబాబు సూచించారు. నా గవర్నమెంటు నా ఇష్టం అన్నట్టుగా జగన్ వ్యవహరిస్తున్నారు.. నా పంచాయతీ నా ఇష్టం అని సర్పంచులూ చెప్పాలి అని వివరించారు. 14,15 ఆర్ధిక సంఘం నిధులు, నరేగా నిధులను ప్రభుత్వం దారి మళ్లించిందని…దీనిపై పోరాటం చెయ్యాలని చంద్రబాబు సర్పంచ్ లకు సూచించారు. నరేగా పనుల్లో 6 వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని వివరించారు. వీటిపై పోరాడాలని….పోలీసు కేసులకు భయపడకండి…అవసరం అయితే తప్పుడు కేసులు పెట్టిన అధికారులపై ప్రైవేట్ కేసులు వేద్దాం అని దైర్యం చెప్పారు.

ఒక వ్యక్తి ఎంతగా అబద్ధాలు చెప్పొచ్చు అనేది జగన్ చూస్తే అర్ధం అవుతుందని చంద్రబాబు అన్నారు. వివేకా హత్య లో జగన్ ఎప్పుడు ఏమి చెప్పాడో చూస్తే జగన్ వైఖరి పూర్తిగా అర్ధం అవుతుందని అన్నారు. నేను వివేకా హత్య చేయించాను అని నాకు రక్తం మరక అంటించే ప్రయత్నం చేశారు…..ఇప్పుడు సిబిఐ విచారణ లో నిజాలు బయటకు వస్తున్నాయని చెప్పారు.

జగన్ సోదరి…జగనన్న బాణం షర్మిల ఇప్పుడు ఎక్కడ తిరుగుతుంది అంటూ ప్రశ్నించారు. జగన్ మరో సోదరి సునీత తన తండ్రి హత్యపై ఎలా ఫైట్ చేస్తుందో కూడా మనం చూస్తున్నాం అని చంద్రబాబు అన్నారు. గొడ్డలి పోటును గుండె పోటు అని చెప్పే ప్రయత్నం చేశారని….హత్య కేసు పెట్టవద్దని ఏకం గా CI శంకరయ్య ను బెదిరించిన విషయాలు బయటకు వస్తున్నాయన్నారు. వివేకా శవానికి కుట్లు వేసి….గాయాలు కనపడకుండా పూలు పెడతారా?…మనుషులు ఈ పనులు చేయగలరా….అని చంద్రబాబు అన్నారు. దర్యాప్తు చేస్తున్న CBI అధికారులపైనే కేసు కేసు పెట్టడం దేశం లో ఎక్కడైనా ఉందా అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సిఎం స్థానం లో ఉన్న జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అసత్యాలను, అబద్ధాలను సమర్థవంతంగా చెప్పి జగన్ రాజకీయ లబ్ధి పొందారని..మనం ప్రతి అంశం పై నిజాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలని సర్పంచ్ లను కోరారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravati
  • Nara Chandra babu Naidu
  • sarpanch
  • TDP chief

Related News

Centre Of Excellence For Ai

ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో ఆంధ్రప్రదేశ్‌ కి ఏడు ఒప్పందాలు

Chandrababu Naidu  ఆంధ్రప్రదేశ్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటం టెక్నాలజీ రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్‌గా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ ముందడుగు వేసింది. భవిష్యత్ సాంకేతికతను అందిపుచ్చుకుని, యువతకు ఉజ్వల అవకాశాలు కల్పించడంతో పాటు, ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరిగిన ‘ఇ

  • Bill Gates to visit Amaravati Today

    చంద్రబాబుతో బిల్ గేట్స్ భేటీ

Latest News

  • మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులకు శుభవార్త!

  • పచ్చి బీట్‌రూట్ తింటున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి!

  • అమెరికాలో తెలుగు యువకుడి మృతి

  • మరోసారి టాలీవుడ్ పై దారుణమైన కామెంట్స్ చేసిన తాప్సి

  • మరోసారి వివాదంలో ప్రకాష్ రాజ్

Trending News

    • హోలీకి ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్?

    • బుమ్రా కాదు.. దక్షిణాఫ్రికాకు ఆ బౌలరే పెద్ద సవాలు!

    • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd