HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chalo Vijayawada With One Lakh People On September 1

Chalo Vijayawada:సెప్టెంబర్ 1న లక్ష మందితో ‘చలో విజయవాడ’

కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ (సీపీఎస్‌)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీలోని సీపీఎస్ ఉద్యోగులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టనున్నారు.

  • Author : Hashtag U Date : 24-08-2022 - 1:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cps Imresizer
Cps Imresizer

CPS Employees: కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ (సీపీఎస్‌)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీలోని సీపీఎస్ ఉద్యోగులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టనున్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 1న లక్ష మంది ఉద్యోగులతో చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. శాతవాహన కాలేజీ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ నిర్వహణకు, ఏలూరు రోడ్డు, బీఆర్‌టీఎస్ రోడ్లలో ఏదో ఒక చోట ర్యాలీకి అనుమతి ఇవ్వాలని సీపీఎస్ ఉద్యోగుల సంఘం నాయకులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సీపీఎస్ రద్దు అంశంపై అమరావతిలో మంత్రి బొత్స సత్యనారాయణతో బుధవారం ఉదయం సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. అయితే ఆందోళన కార్యక్రమాలను విరమించుకోవాలని, ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడుతుందని మంత్రి బొత్స సూచించారు.

కాగా చర్చలకు రావాలని మంత్రి బొత్స పిలిస్తేనే తాము వచ్చామని ఏపీసీపీఎస్ యూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాస్ ఎన్టీవీతో వ్యాఖ్యానించారు. పాత పెన్షన్ విధానమే కొనసాగించాలన్నదే తమ డిమాండ్ అన్నారు. ఈ ఒక్క అంశం మీద మాత్రమే చర్చించామని తెలిపారు. తమ భవిష్యత్ గురించి తాము భయపడటం లేదని.. చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునివ్వడంతో ముందస్తుగా బెదిరిస్తున్నారని.. ఏదేమైనా సెప్టెంబర్ 1న సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. అటు పోలీస్ విభాగంలో కూడా చాలా మంది సీపీఎస్ ఉద్యోగులు ఉన్నందున కచ్చితంగా తాము తలపెట్టిన కార్యక్రమానికి సహకారం లభిస్తుందని ఏపీసీపీఎస్ఈఏ ప్రజా సంబంధాల అధికారి జి.శ్రీనివాసరావు తెలిపారు. అంతేకాకుండా సీపీఎస్ ఉద్యోగ సంఘాలకు మద్దతు ప్రకటించే ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జేఏసీలకు ఈసారి ఏపీసీపీఎస్ఈఏ ఎలాంటి ఆహ్వానాలు పంపడం లేదని.. వారి మద్దతు తీసుకోవాలని తాము భావించడం లేదని స్పష్టం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh employees
  • AP government
  • chalo vijayawada

Related News

Ap Logo

Pawan Kalyan: ఏపీ పంచాయతీరాజ్‌ శాఖకు 5 జాతీయ స్థాయిలో అవార్డులు..

Panchayat Raj ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో సత్తా చాటింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వం వహిస్తున్న ఈ శాఖకు ఏకంగా ఐదు జాతీయ పురస్కారాలు లభించాయి. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతం, సేవల విస్తరణలో కనబరిచిన అత్యుత్తమ పనితీరుకు గానూ కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ఈ అవార్డులను ప్రకటించింది. వివరాల్లోకి వెళితే… రాష్ట్రీయ గ్రామస్వ

  • Good News For Ap School Stu

    Smart kitchens : ఏపీ స్కూల్ విద్యార్థులకు శుభవార్త

Latest News

  • ఐపీఎల్‌లో అరుదైన ఘ‌న‌త సాధించిన ర‌హానే!

  • భార‌త మార్కెట్లోకి కొత్త ఎల‌క్ట్రిక్ కారు.. ధ‌ర ఎంతంటే?

  • మీ ఫోన్ స్లో అవుతుందా? అయితే ఈ యాప్స్ తీసేయండి!

  • శాశ్వత ప్రజా రాజధానిగా అమరావతి!

  • వాట్సాప్‌లో మ‌రో స‌రికొత్త ఫీచ‌ర్!

Trending News

    • హైద‌రాబాద్‌తో కోల్‌క‌తా మ్యాచ్‌.. కేకేఆర్‌కు హోం గ్రౌండ్ క‌లిసొస్తుందా?

    • Amaravathi Capital: అమరావతి రాజధాని బిల్లుకు రాజ్యసభ ఆమోదం

    • శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు గాయం.. సీఎస్కేతో మ్యాచ్‌కు దూరం?!

    • Condom Shortage: భారీగా పెరగనున్న కండోమ్ ధరలు

    • అల‌ర్ట్‌.. నేటి నుంచి కీల‌క మార్పులు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd