Nellore CBN : వైసీపీ అడ్డాలోకి చంద్రబాబు! హాట్‌గా `ఇదేం ఖర్మ రాష్ట్రానికి..` !
బాబు (Nellore CBN) 3 రోజుల పాటు `ఇదేం ఖర్మ రాష్ట్రానికి..` ప్రోగ్రామ్ ను నిర్వహించనున్నారు..
- Author : CS Rao
Date : 27-12-2022 - 2:39 IST
Published By : Hashtagu Telugu Desk
వైసీపీ అడ్డాలోకి చంద్రబాబునాయుడు మూడు రోజుల పాటు `ఇదేం ఖర్మ రాష్ట్రానికి..` ప్రోగ్రామ్ ను నిర్వహించనున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ స్వీప్ చేసిన నెల్లూరు(Nellore CBN) జిల్లాలోకి బుధవారం అడుగుపెడుతున్నారు. ఆయనకు ఆహ్వానం పలికేందుకు టీడీపీ(TDP) శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ సందర్భంగా వైసీపీ, టీడీపీ మధ్య వివాదం నెలకొంది. నెల్లూరు(Nellore CBN) జిల్లా కావలి పట్టణంలో చంద్రబాబు పోస్టర్లను వైసీపీ చించేసింది. మున్సిపల్ అధికారులతో తొలగించడానికి సన్నద్ధం అయింది. దీంతో టీడీపీ శ్రేణులు రంగంలోకి దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది.
కావలి (Nellore CBN)లో చంద్రబాబు పోస్టర్లను..
ఈ నెల 28న కందుకూరు, 29న కావలి, 30న కోవూరులో ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొంటారు. కందుకూరు, కావలిలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో నియోజకవర్గ ఇన్ చార్జిలు నాగేశ్వరరావు పెద్ద ఎత్తున జనాన్ని తరలించడానికి సన్నాహాలు చేశారు. చంద్రబాబు సభ, బస ప్రాంతాలను సోమవారం టీడీపీ ముఖ్యనేతలు పరిశీలించారు. ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాల కంటే మిన్నగా సభలను విజయవంతం చేయాలని భావిస్తున్నారు. గత నెల రోజులుగా చంద్రబాబు సభలకు వస్తోన్న జనం పరిస్థితులను మార్చేస్తున్నారు. స్వచ్చంధంగా ఆయన సభలకు వస్తున్నారని టీడీపీ (TDP) చెబుతోంది. పైగా చంద్రబాబు స్పీచ్ ముగిసే వరకు జనం ఉంటున్నారు. ఈ పరిణామాలను గమనిస్తే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద జనం విసిగిపోయారా? అనే అనుమానం కలుగుతోంది.
Also Read : CBN Meetings : చంద్రబాబు సభల సక్సెస్!`జన సందోహం` సీక్రెట్
`ఇదేం ఖర్మ రాష్ట్రానికి..` కార్యక్రమానికి కర్నూలు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆ తరువాత పొన్నూరు, బాపట్ల ప్రజలు నీరాజనం పలికారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయన రోడ్ షోలకు దారిపొడవునా జనం బారులు తీరారు. స్వాగతం పలుకుతూ పూలవర్షాన్ని కురిపించారు. ఇక తాజాగా జరిగిన విజయనగరం `ఇదేం ఖర్మమ రాష్ట్రానికి..` జనం పోటెత్తారు. ఇసుకేస్తే రాలనంతగా జనం కిక్కిరిసి పోయారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఆయన సభలను బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. అదే ఒరవడి కొనసాగాలని టీడీపీ భావిస్తోంది. అయితే, వైసీపీ బలంగా ఉన్న కందుకూరు, నెల్లూరు, కోవూరు నియోజకవర్గాల పరిధిలో చంద్రబాబుకు జనం ఎలా వస్తారో, ఆసక్తికరంగా మారింది.
గతంలో తెలుగుదేశం పార్టీకి కొంత మేరకు నెల్లూరు జిల్లాలో స్థానం ఉండేది. కానీ, 2019 ఎన్నికల్లో వైసీపీ పూర్తిగా స్వీప్ చేసింది. అంతేకాదు, ఆ జిల్లాల్లో చెప్పుకోతగిన నాయకులు కూడా పెద్దగా టీడీపీకి లేరు. ఎప్పటికప్పుడు వలస వచ్చే నాయకులతో టీడీపీ నిండిపోతోంది. ఆ జిల్లాలోని బీద రవిచంద్ర కొంత మేరకు జన సమీకరణకు ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. మిగిలిన చోట్ల జనం స్వచ్చంధంగా తరలి వస్తారని చంద్రబాబు అండ్ కో అంచనా వేస్తోంది.కావలి ఎమ్మెల్యేగా ఉన్న ప్రతాప్ రెడ్డి రాజకీయాన్ని టీడీపీ స్థానిక నేతలు తట్టుకోలేకపోతున్నారు. ఆయన చేసే దందాల నుంచి బెదిరింపుల వరకు ప్రజల్ని కాపాడేందుకు టీడీపీ ధైర్యం చేయలేకపోతోంది. ప్రజల్లో వైసీపీ మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ వాళ్లకు అండగా నిలబడే నికార్సైన లీడర్ టీడీపీలో లేకపోవడం మైనస్ గా కనిపిస్తోంది.
వైసీపీ అడ్డాలోనూ చంద్రబాబు హవా
ఇక కందుకూరు ఎమ్మెల్యేగా ఉన్న మానుగుంట మహీంధర్ రెడ్డి ఒకానొక సమయంలో జగన్మోహన్ రెడ్డి పాలన మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. మంచినీళ్లు, తట్టమట్టిని రోడ్డుకు వేయలేని పరిస్థితి ఉందని అధికారపక్షాన ఉండి కూడా విమర్శించారు. సీనియర్ లీడర్ గా ఉన్న ఆయన్ను ఢీ కొట్టే లీడర్లు టీడీపీలో ఉన్నారు. కానీ, సమన్వయం వాళ్ల మధ్య లేకపోవడం పెద్ద మైనస్. ఈసారి ఐక్యంగా టీడీపీ లీడర్లు ముందుకు వస్తారని అధిష్టానం భావిస్తోంది. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దివి శివరాం అక్కడ బలంగా ఉన్నారు. ఆయనకు పూర్తి స్థాయి పగ్గాలను టీడీపీ అప్పగించలేదు. దీంతో కొంత అసహనం టీడీపీ శ్రేణుల్లో ఉన్నప్పటికీ ఆ పార్టీ ఓటు బ్యాంకు అక్కడ ఎక్కువగా ఉంది. ఫలితంగా కందుకూరు సభ సూపర్ హిట్ కావడానికి ఛాన్స్ ఉంది. ఇక కావలి, కోవూరు సభలు కూడా విజయవంతమైతే వైసీపీ అడ్డాలోనూ చంద్రబాబు హవా ప్రారంభం అయినట్టే.!
Also Read : CBN Kadapa Tour : జగన్ అడ్డాలో బాబు హవా