Jagan Foreign Tour : జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
యూకే వెళ్లే ముందు పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు, మొబైల్ నంబరు, మెయిల్ వివరాలు కోర్టుకు, సీబీఐకి ఇవ్వాలని ఆదేశించింది
- Author : Sudheer
Date : 27-08-2024 - 8:58 IST
Published By : Hashtagu Telugu Desk
వైసీపీ అధినేత , మాజీ సీఎం జగన్ (Jagan) కు సీబీఐ కోర్టు (CBI Court) తీపి కబురు తెలిపింది. జగన్ యూకే (Jagan’s foreign tour) వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతినిచ్చింది. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 25 వ తేదీ వరకు యూకేలో (UK) ఉన్న కుమార్తె పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యేందుకు సీబీఐ కోర్టులో జగన్ 15 రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు మంగళవారం సాయంత్రం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
యూకే వెళ్లే ముందు పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు, మొబైల్ నంబరు, మెయిల్ వివరాలు కోర్టుకు, సీబీఐకి ఇవ్వాలని ఆదేశించింది. అదేవిధంగా ఐదేళ్ల కాలపరిమితితో కొత్త పాస్‌పోర్టు జారీకి అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 3 నుంచి 25 వరకు జగన్ యూకేలో పర్యటించనున్నారు. అక్కడ చదువుతున్న తన కుమార్తెను ఆయన కలవనున్నారు.
అంతకు ముందు జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతించొద్దని సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. పదేళ్లుగా జగన్ బెయిల్‌పైనే ఉన్నారంటూ సీబీఐ అభ్యంతరం తెలిపింది. ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని సర్వోన్న న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో జగన్‌కు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ న్యాయస్థానాన్ని కోరింది. సీబీఐ అభ్యంతరాలను జగన్ తరపు న్యాయవాదులు తోసిపుచ్చారు. గతంలో కూడా పలుమార్లు కోర్టు విదేశీ పర్యటనలకు అనుమతించి ఇచ్చిందని గుర్తు చేశారు. కోర్టు ఆదేశాలను జగన్ ఎప్పుడు ఉల్లంఘించలేదని గుర్తు చేశారు. దీనిపై మంగళవారం విచారణ జరిపిన కోర్ట్ విదేశాలకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Read Also : Jai Shah : ఐసీసీ నూతన ఛైర్మన్ గా జై షా