Fake Doctuments Case : వైసీపీ మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషా పై కేసు నమోదు
మాజీ ఎమ్మెల్యే గా పనిచేసిన మున్వర్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. చాంద్ బాషా ప్రోత్సాహంతోనే నకిలీ పట్టాలు తయారు చేసినట్లుగా అతను అంగీకరించాడు.
- By Latha Suma Published Date - 04:02 PM, Wed - 27 November 24
Chand Basha : కదిరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషా పై కేసు నమోదైంది. నకిలీ ఇంటి పట్టాల తయారీ వ్యవహారంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2018లో చాంద్ బాషా అసైన్మెంట్ కమిటీ చైర్మన్ గా ఉన్నప్పుడే నకిలీ పట్టాలు తయారు చేసినట్లు పోలీస్ విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలో ఆయనను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. కాగా, మాజీ ఎమ్మెల్యే గా పనిచేసిన మున్వర్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. చాంద్ బాషా ప్రోత్సాహంతోనే నకిలీ పట్టాలు తయారు చేసినట్లుగా అతను అంగీకరించాడు.
నకిలీ పట్టాలు తయారీ చేయడానికి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మున్వర్ రూ.20 లక్షలు లంచం డిమాండు చేశాడని.. ఆయన అడిగిన దానిలో రూ.11 లక్షలు ఇచ్చినట్లు సోమ్లానాయక్ పోలీసుల ఎదుట చెప్పాడు. ఈ క్రమంలో నకిలీ పట్టాల తయారీకి ప్రోత్సహించిన మాజీ ఎమ్మెల్యే చాంద్‌బాష, ఆర్.ఐ.ని దోషులుగా పేర్కొంటూ కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి ఆయన వద్ద నుంచి 39 కిలీ పట్టాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ నారాయణరెడ్డి చెప్పారు. కోర్టు నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించినట్లు చెప్పారు.
Read Also: Sajjala Bhargav Reddy: సజ్జల భార్గవ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ల విచారణ ఈ నెల 29కి వాయిదా!