Lokesh Praja Darbar : లోకేష్ కు హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్ల వినతి..
తెలంగాణ ప్రభుత్వం తమపై విధించిన నిబంధనలను తొలగించేలా చూడాలని ఏపీ క్యాబ్ డ్రైవర్లు మంత్రి నారా లోకేశ్ కు వినతిపత్రం అందజేశారు
- Author : Sudheer
Date : 02-07-2024 - 5:54 IST
Published By : Hashtagu Telugu Desk
నారా లోకేష్ చేపట్టిన ప్రజాదర్బార్ (Lokesh in Praja Darbar) కు ప్రజల నుండి విశేష స్పందన వస్తుంది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్దీ గంటల్లోనే ఈ సంచలన నిర్ణయం తీసుకొని వార్తల్లో నిలిచారు. గత అయిదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నా సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజల మనసును నారా లోకేష్ గెలిచారు. ఇక ఇప్పుడు గెలిచినా తర్వాత కూడా నియోజకవర్గ ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రజాదర్బార్ అనే కార్య క్రమాన్ని చేపట్టారు. కేవలం నియోజవర్గ ప్రజలే కాకుండా ప్రతి జిల్లా వారు తమ సమస్యలను లోకేష్ ముందు ఉంచుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా హైదరాబాద్ లో క్యాబ్ డ్రైవర్స్ (Cab Drivers Request) ఎదురుకుంటున్న సమస్యను లోకేష్ కు తెలియజేసారు. తెలంగాణ ప్రభుత్వం తమపై విధించిన నిబంధనలను తొలగించేలా చూడాలని ఏపీ క్యాబ్ డ్రైవర్లు మంత్రి నారా లోకేశ్ కు వినతిపత్రం అందజేశారు. ప్రజాదర్బార్ లో క్యాబ్ డ్రైవర్లు ఆయన్ను కలిశారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కాలం ముగియడంతో.. తమ వాహనాలకు లైఫ్ ట్యాక్స్ చెల్లించాలని తెలంగాణ అధికారులు చెబుతున్నారని, ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న సమయంలో తాము లైఫ్ ట్యాక్స్ కట్టామని, మరోసారి లైఫ్ ట్యాక్స్ కట్టే స్తోమత లేదని , ఏపీ వాహనాలపై హైదరాబాద్ అధికారులు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇదిలా ఉంటె ఈ నెల 06 న తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి భేటీ కానున్న నేపథ్యంలో క్యాబ్ డ్రైవర్లు తమ సమస్యలను కూడా పరిష్కరించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
Read Also : Kolikapudi Srinivasa Rao : ఆందోళనకు దిగిన కూటమి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు