AP : బీటెక్ విద్యార్థిని బెదిరించి పలువురు..పలుమార్లు అత్యాచారం
అనంతపురం కు చెందిన బిటెక్ విద్యార్థిని ఫై పలువురు..పలుమార్లు బెదిరించి అత్యాచారం చేసిన ఘటన బయటకొచ్చింది
- Author : Sudheer
Date : 04-11-2023 - 3:29 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ (AP)లో మహిళలపై , యువతుల ఫై దాడులు ( Woman Attackes) , అత్యాచారాలు (Rapes) ఆగడం లేదు..ప్రతిపక్ష పార్టీల నేతలు..అధికార పార్టీ మహిళ నేతలను ఏమైనా అంటే టక్కున కేసులు పెట్టె..మహిళా కమిషన్ (AP Women Commission)..రాష్ట్రంలో ప్రతి రోజు ఎక్కడో ఓ చోట అత్యాచార ఘటన, ఒంటరి మహిళలపై వేదింపులు , హత్యలు చేయడం జరుగుతున్న ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పలు ఘటనలు వెలుగులోకి వచ్చినప్పటికీ కూడా నోరు మెదపడం లేదని అంత విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు వెలుగులోకి రాగా..తాజాగా మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అనంతపురం కు చెందిన బిటెక్ విద్యార్థి (Btech Girl)ని ఫై పలువురు..పలుమార్లు బెదిరించి అత్యాచారం చేసిన ఘటన బయటకొచ్చింది.
వివరాల్లోకి వెళ్తే..
అనంతపురం (Anantapur District) జిల్లా తాడిపత్రి (Tadipatri)కి చెందిన ఓ విద్యార్థిని విజయవాడలో ఉంటూ బీటెక్ చదువుతోంది. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన కృష్ణారెడ్డి అనే యువకుడు గత కొద్దీ రోజులుగా సదరు యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. నన్ను ప్రేమిస్తావా లేదా? అంటూ బ్లేడుతో చేతిని కోసుకోవడంతో.. భయంతో వణికిపోయిన ఆ విద్యార్థిని అప్పడి నుంచి అతడితో సన్నిహితంగా ఉంటూ వచ్చింది. ఇదే అదునుగా భావించిన కృష్ణారెడ్డి.. గత నెల 19వ తేదీన విజయవాడలో ఉన్న యువతికి ఫోన్ చేసి.. బెంగళూరుకు రావాలని బలవంతం చేశాడు. రాకపోతే మన ప్రేమ విషయం మీ పెద్దవారికి చెపుతానంటూ బెదిరించాడు. దాంతో భయపడి పోయిన ఆ యువతి అతడు చెప్పినట్టుగానే 20వ తేదీన బెంగళూరుకు వెళ్లింది.
We’re now on WhatsApp. Click to Join.
అప్పటికే ప్లాన్ చేసిన కృష్ణారెడ్డి.. ఆ యువతిని తన స్నేహితుడి గదికి తీసుకెళ్లాడు.. ఎవరూ లేని సమయం చేసి.. ఆమెను బెదిరించి అత్యాచారానికి ఒడిగట్టాడు.. ఒక్కరోజు కాదు.. అలా నాలుగు రోజుల పాటు యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. వేధింపులు బరించలేకి సొంతూరుకు వెళ్లిపోయిన ఆ విద్యార్థిని తిరిగి 28వ తేదీన విజయవాడ వెళ్లేందుకు బయలుదేరింది. గుంతకల్లుకు చెందిన దివాకర్ అనే వ్యక్తి బాధితురాలికి ఫోన్ చేసి.. కృష్ణారెడ్డితో ఏకాంతంగా కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు తన వద్ద ఉన్నాయని.. తాను చెప్పినట్టు చేయకపోతే సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించాడు. దాంతో.. భయపడిన బాధితురాలు.. దివాకర్ చెప్పినట్టు గుంతకల్లుకు వెళ్లింది. అతడు కూడా ఓ లాడ్జికి తీసుకెళ్లి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. రెండు రోజుల పాటు ఆమెకు నరకం చూపించాడు. అక్కడితో ఆగకుండా ఆమెతో గడిపిన క్షణాల్లో రహస్యంగా ఫొటోలు, వీడియోలు చిత్రీకరించాడు. ఆ తర్వాత ఆ ఫొటోస్, వీడియోస్ కృష్ణారెడ్డితో పాటు మరికొందరికి షేర్ చేశాడు. ఇవన్నీ ఏమి తెలియని బాధితురాలు విజయవాడకు వెళ్లిపోయింది. కానీ, ఆ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ..బాధితురాలి మండలానికి చెందిన ఓ వ్యక్తికి చేరాయి. అతడు ఆ అమ్మాయి సమీప బంధువులకు విషయం తెలియజేశాడు.. దీంతో. ఆందోళనకు గురైన ఆ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. కృష్ణారెడ్డి, దివాకర్ లను అదుపులోకి తీసుకున్నారు.
Read Also : MLC Kavitha: బతుకమ్మ చీరలతో రాజకీయం చేసిన కాంగ్రెస్ కు మహిళలు కర్రుకాల్చి వాతపెడుతారు!