BR Naidu : జగన్ పై రూ.100 కోట్ల పరువు నష్ట దావా వేయబోతున్న బీఆర్ నాయుడు..?
BR Naidu : ఇప్పుడు ‘Truth Bomb Dropping’ జగన్ కిందనే బాంబు లా మారింది. వైసీపీ పోస్ట్ చేసిన పత్రాల్లో టీవీ 5 బీఆర్ నాయుడు కుమారుడిపై ఆరోపణలను చేసారు.
- Author : Sudheer
Date : 25-10-2024 - 11:57 IST
Published By : Hashtagu Telugu Desk
తోందరపాటు అనేది చాల ముప్పు. ఏ పని చేసిన తోందరపాటు పనికిరాదని , తోందరపాటు నిర్ణయాలు ప్రాణాల మీదకు వస్తాయని పెద్దలు చెపుతుంటారు. కానీ చాలామంది ఎవరి మాట వినకుండా..ఎవర్ని లెక్క చేయకుండా తోందరపాటు నిర్ణయాలు తీసుకొని చిక్కుల్లో పడతారు. తాజాగా జగన్ కూడా ఇప్పుడు అలాంటి చిక్కుల్లో పడ్డాడు.
టీడీపీ, వైసీపీ పార్టీలు అక్టోబర్ 24 మధ్యాహ్నం 12 గంటలకు ‘Big Expose’ అంటూ టీడీపీ.. ‘Truth Bomb Dropping’ అంటూ వైసీపీ ట్వీట్ చేసింది. ఇలా ఇరు పార్టీల పోస్టులకు అర్థం ఏంటి? ఏం చెప్పబోతున్నాయి? ఏంజరగబోతుంది..? అని టీడీపీ, వైసీపీ శ్రేణులే కాదు ప్రజలు సైతం తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూసారు. అయితే చెప్పిన టైం కంటే ముందే టీడీపీ..వైస్సార్ కుటుంబంలో జరుగుతున్న ఆస్తి గొడవలు బయటపెట్టి సంచలనం రేపింది.
జగన్ ..షర్మిల కు ఇచ్చిన హెచ్చరిక , దానికి షర్మిల ఇచ్చిన కౌంటర్లను టీడీపీ ప్రజల ముందు ఉంచి యావత్ తెలుగు ప్రజలు మాట్లాడుకునేలా చేసింది. అయితే వైసీపీ ఎలాంటి ట్వీట్ చేస్తుందో..ఏ సంచలనం రేపుతుందో అని అంత ఎదురుచూసారు. కానీ వైసీపీ మాత్రం తుస్సు మంటూ నీరుకార్చింది. ‘మీడియా ముసుగు వేసుకుని డ్రగ్స్ మాఫియా (Drug mafia)ని నడిపేవారికి టీటీడీ ఛైర్మన్ పదవులా? గత కొన్నేళ్లుగా 15 మంది డ్రగ్స్ వినియోగదారులతో రెగ్యులర్ గా వ్యవహారాలు నడుపుతూ దొరికిన ఎల్లో న్యూస్ ఛానల్ అధినేత.. సాక్ష్యాలివిగో!’ అంటూ కొన్ని పత్రాలను జత చేసింది. తాము ఇచ్చిన సమాచారం వంద శాతం కరెక్ట్ అని ధీమాగా చెప్పలేకపోయింది. చాలా వరకు వాటిని బ్లర్ చేసింది. అయితే క్లారిటీ లేకుండా బిగ్ రివీల్ అంటూ చెప్పడం దేనికంటూ అంత కామెంట్స్ వేశారు.
ఇప్పుడు ‘Truth Bomb Dropping’ జగన్ కిందనే బాంబు లా మారింది. వైసీపీ పోస్ట్ చేసిన పత్రాల్లో టీవీ 5 బీఆర్ నాయుడు (BR Naidu) కుమారుడిపై ఆరోపణలను చేసారు. అయితే ఇది ముందుగా సాక్షి పత్రికలో ప్రచారం చేసారు. దీనిపై టీవీ5 మూర్తి (TV5 Murthi) ఘాటుగా స్పందించారు. వైసీపీ మరియు సాక్షి పత్రిక పై వంద కోట్ల రూపాయలకు పరువు నష్టం కేసు దాఖలు చేయబోతున్నారని ప్రకటించారు. సాక్షి పత్రిక విడుదల చేసిన సమాచారం ప్రకారం.. బీఆర్ నాయుడు కుమారుడి పేరు స్పష్టంగా లేవు, కేవలం అనుమానితులతో సంబంధం ఉన్నట్లుగా మాత్రమే పేర్కొన్నది. అందులో ఆయన డ్రగ్స్ కొన్నాడని కానీ అమ్మాడని కానీ ఇంకా చెప్పాలంటే కనీసం వినియోగించాడని కానీ లేదు. డ్రగ్స్ వాడే అనుమానితులతో ఆయన టచ్‌లో ఉన్నారని ఉంది. కానీ అవేమి పట్టించుకోకుండా వైసీపీ బురద చల్లే ప్రయత్నం చేసింది. దీంతో ఇప్పుడు చిక్కుల్లో పడే స్థాయికి జగన్ చేరుకున్నాడు.. అందుకే తొందర పటు మంచిది కాదు అనేది.
Read Also : kadambari Jethwani: బాలీవుడ్ నటి కాదంబరి జేత్వాని కేసు సీఐడీ కోర్టుకు?